మ‌న దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు సీఎంలుగా ఉన్న‌ది వీరే..!

-

బీహార్ ముఖ్య‌మంత్రిగా నితీష్ కుమార్ ఇటీవ‌లే 7వ సారి ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. అత్యంత సుదీర్ఘ‌కాలం పాటు బీహార్‌కు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన వ్య‌క్తుల్లో ఆయ‌న రెండో స్థానంలో ఉన్నారు. ఇక మ‌న దేశంలోని ప‌లు రాష్ట్రాల‌కు అత్యంత సుదీర్ఘ‌కాలం పాటు ప‌నిచేసిన ముఖ్య‌మంత్రుల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

longest period served cms in india

* సిక్కింకు ప‌వ‌న్ కుమార్ చామ్లింగ్ అత్యంత సుదీర్ఘ కాలం పాటు సీఎంగా ప‌నిచేశారు. ఆయ‌న మొత్తం 24.5 ఏళ్ల పాటు సీఎం ప‌దవిలో ఉన్నారు.

* ప‌శ్చిమ బెంగాల్‌కు జ్యోతి బ‌సు 23.4 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు.

* అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు 22.8 ఏళ్ల పాటు జెగాంగ్ అపాంగ్ సీఎంగా ప‌నిచేశారు.

* మిజోరంకు 21.1 ఏళ్ల పాటు లాల్ థ‌న్హావ్లా ముఖ్యమంత్రిగా ఉన్నారు.

* హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు 21.11 ఏళ్ల పాటు వీర‌భ‌ద్ర సింగ్ సీఎంగా ప‌నిచేశారు.

* ఒడిశాకు న‌వీన్ ప‌ట్నాయ‌క్ 20.8 ఏళ్ల పాటు సీఎంగా ప‌నిచేశారు. ఈయ‌న ఇప్ప‌టికీ ప‌దవిలో ఉన్నారు.

* త్రిపుర‌కు మాణిక్ స‌ర్కార్ 20 ఏళ్లు సీఎంగా ఉన్నారు.

* ఎం.క‌రుణానిధి త‌మిళ‌నాడుకు 19 ఏళ్లు సీఎంగా ఉన్నారు.

య‌శ్వంత్ సింగ్ ప‌ర్మార్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు 18 ఏళ్లు సీఎంగా ఉండ‌గా, రాజ‌స్థాన్‌కు 16.6 ఏళ్ల పాటు మోహ‌న్‌లాల్ సుఖ‌దియా సీఎంగా ఉన్నారు. గోవాకు ప్ర‌తాప్ సింగ్ రాణె 15.10 ఏళ్లు, నాగాలాండ్‌కు ఎస్‌సీ జ‌మీర్ 15.5 ఏళ్లు, అస్సాంకు త‌రుణ్ గొగొయ్ 15 ఏళ్లు, ఢిల్లీకి షీలా దీక్షిత్ 15 ఏళ్లు, మ‌ణిపూర్‌కు ఒక్రం ఇబొబి సింగ్ 15 ఏళ్లు, చ‌త్తీస్‌గ‌డ్‌కు ర‌మ‌ణ్‌సింగ్ 15 ఏళ్లు, బీహార్‌కు సాయి కృష్ణ సిన్హా 14.10 ఏళ్లు సీఎంలుగా ఉన్నారు.

అదేవిధంగా త‌మిళ‌నాడుకు జె.జ‌య‌ల‌లిత 14.5 ఏళ్ల పాటు సీఎంగా ప‌నిచేయ‌గా, మేఘాల‌య‌కు 14.5 ఏళ్ల పాటు విలియ‌మ్స‌న్ సంగ్మా, బీహార్‌కు నితీష్ కుమార్ 14.3 ఏళ్ల పాటు సీఎంలుగా ఉన్నారు. ఇక నితీష్ కుమార్ తాజాగా మ‌ళ్లీ బీహార్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news