ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను చూశారా?

-

చైనా అంటేనే సమ్ థింగ్ స్పెషల్. దేంట్లోనైనా తమ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటారు వాళ్లు. ఏ టెక్నాలజీ కానీ ముందు చైనాలో రావాల్సిందే. అన్నింట్లో ముందుండాలనే తాపత్రయం, ఆసక్తి, పట్టుదలే వాళ్లను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న చైనా.. తాజాగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను నిర్మించి అన్ని రికార్డులను తిరగరాసింది. ఈ నెల 24 న ఈ వంతెన ప్రారంభం కానుంది. ఈ వంతెన చైనా, హాంకాంగ్, మకావ్ లను కలుపుతుంది. మొత్తం 55 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల రోడ్డు అది. దీని నిర్మాణం 2009లో ప్రారంభం అయింది. ప్రతిరోజు దాదాపు 30 వేల మంది ఈ వంతెనపై ప్రయాణించే అవకాశం ఉందట. ఇంకో 120 ఏళ్ల పాటు ఈ వంతెన పటిష్టంగా ఉంటుందట.

Read more RELATED
Recommended to you

Latest news