మెసేజ్ చేసినందుకు 3.5లక్షల పరిహారం చెల్లించిన యువకుడు.. అసలేం జరిగిందంటే,

-

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. మహిళకు మెసేజ్ కి చేసిన ఒక యువకుడు 3.5లక్షల పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చింది. మెసేజీల ద్వారా ఆమె భావాలని గాయపరిచినందుకు గాను ఈ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. టెక్స్ట్ మెసేజీల ద్వారా ఆమెని ఇబ్బంది పెట్టినందుకు మొత్తంగా 1 లక్ష ధరమ్ చెల్లించాలని డిమాండ్ చేసింది. చాలా మంది మగాళ్ళతో ఆ మహిళకు సంబంధం ఉన్నట్లుగా ఆ మెసేజీలు ఉన్నాయి. అంతే కాదు ఆ మహిళ ఫోటోలను పంపి యువకుడిని లొంగదీసుకోవాలని చూస్తున్నదని కూడా ఉంది.

ఈ మెసేజీలన్నీ ఆ యువకుడు చేసాడు. దానివల్ల తీవ్రంగా మనోవేదనకి గురైన మహిళ ఆ యువకుడిపై కేసు వేసింది. 1లక్ష ధరమ్ చెల్లించాలని, మనసును గాయపర్చినందుకు ఆ మాత్రం చెల్లించాలని కోరింది. యువకుడు మాట్లాడుతూ ఆ మహిళ తన దగ్గర 39000ధరమ్ అప్పు తీసుకుందని అన్నాడు. వాదోప వాదనలు విన్న తర్వాత ఉద్దేశ్యపూర్వకంగానే మహిళని దాడి చేసాడని, మెసేజీల ద్వారా మనసును గాయపర్చి, ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలని ప్రయత్నించాడని కోర్టు భావించింది.

అందువల్ల మహిళ కోరుకున్నట్టుగా కాకుండా 20వేల ధరమ్ పరిహారం చెల్లించాలని కోరింది. ఇండియా కరెన్సీ ప్రకారం అది 3.5లక్షల రూపాయలు. అదీగాక కోర్టు ఫీజులు అదనంగా చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చైనాలో జరిగిన ఆసక్తికర సంఘటన ఒకటి ఉంది. విడాకుల సమయంలో భర్త నుండి విడాకులు తీసుకుంటున్న మహిళ, పెళ్ళైనప్పటి నుండి ఇంటి పని చేసినందుకుగాకు పరిహారం చెల్లించాలని కోరింది. ఈ మేరకు కోర్టు 7700డాలర్లు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది. అప్పట్లో ఇది వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news