హనుమంతుడి జన్మస్థలం ఎక్కడో రేపు తేలిపోతుందా…?

-

హనుమంతుని జన్మస్థలం పై హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తో చర్చకు టీటీడీ రెడీ అయింది. రేపు తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో హనుమంతుని జన్మ స్థలం పై ఇరు పక్షాల మధ్య చర్చ జరగనుంది. కిష్కింద ట్రస్ట్ తరుపున చర్చలో శ్రీ గోవిందానంద సరస్వతి పాల్గొంటారు. టీటీడీ తరుపున చర్చలో కమిటీ కన్వీనర్,

ttd

సభ్యులు పాల్గొంటారు. శ్రీరామనవమి రోజున తిరుమలలోని అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించారు.టీటీడీ ప్రకటన పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్… టీటీడీకి పరుష పదజాలంతో లేఖలు రాసింది. బహిరంగ చర్చకు రావాలంటూ టీటీడీకి సవాలు చేసింది. హనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్టు సవాల్ కు స్పందించిన టీటీడీ…. రేపు హనుమంతుని జన్మ స్థానంపై ఆధారాలను బయటపెట్టడానికి రెడీ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news