కొంతమంది ఎంత సంపాదించినా.. వచ్చిన దారినుంచే డబ్బు అంతా పోతుంది. అస్సలు డబ్బు ఇంట్లో నిలవదు. అదేంటో అప్పటికప్పుడు ఎక్కడలేకని ఖర్చులు పుట్టుకొచ్చేస్తాయి. మీకు కూడా ఇలానే జరుగుతుంటే.. కొన్ని చిట్కాలను పాటించండి. ధాన్యాలు ఉంచడం, డబ్బుల పర్సులో లవంగాలు పెట్టుకోవడం, దాల్చిన చెక్క పొడి వాటికి రాయడం వంటివి చేస్తూనే ఉంటారు. అటువంటిదే ఇది కూడా. మీ డబ్బును నిలుపుకునే ఈ సింపుల్ మార్గం మీరు అనుసరించి చూడండి.
ఇంట్లో డబ్బు నిలవడం లేదంటే వాస్తు దోషం అనుకుంటారు. లేదంటే అదృష్టం కలిసి రావడం లేదని బాధపడతారు. కానీ మీ డబ్బును పొదుపు చేసుకునే అద్భుతమైన సింపుల్ రెమిడికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇంట్లో డబ్బును ఆకర్షించే ఒక కుండని సృష్టించి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది. ఈ కుండని మీరు ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో కూడా చెప్పారు.
మ్యాజిక్ మట్టి కుండ..!
ఒక చిన్న మట్టి కుండ తీసుకుని అందులో 5 రూపాయల నాణేలు వేసుకోవాలి. అందుకే రూపాయి, రెండు రూపాయిల నాణేలు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం. ఆ తర్వాత 5 రకాల ధాన్యాలు తీసుకోవాలి. వంటగదిలో ఇవి సులభంగా దొరికేస్తాయి. బియ్యం, మొక్కజొన్న, గోధుమలు, బార్లీ, మరేదైనా ధాన్యంతో కుండని నింపుకోవాలి. ఈ కుండ మీద ఎర్రటి వస్త్రం కప్పాలి. తర్వాత ఎరుపు రంగు దారంతో దాన్ని మూసేసి 24 గంటల పాటు ఇంటి పూజ గదిలో పెట్టుకోండి. తర్వాత దీన్ని మీరు మీ అల్మరా లేదా ఇంకెక్కడైనా భద్రంగా దాచుకోవచ్చు.
మట్టి, గింజలు ఎందుకంటే..
మట్టి కుండని ఉపయోగించడానికి కారణం అది భూమిని సూచిస్తుంది. వస్తువులను తన వైపుకు లాక్కోగల గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. అది కుండకు కూడా వర్తిస్తుంది. ఇక అందులో వేసే ప్రధానమైన ధాన్యాలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఇవి ఇంట్లో ప్రవృత్తిని తెస్తాయని నమ్ముతారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.. ఇది క్లియర్గా చూడండి.! మీకే ఐడియా వస్తుంది.
View this post on Instagram