దోమలు వీరినే ఎక్కువగా కుడతాయట.. ఎందుకంటే..?

-

ఎవ్వరింట్లో అయినా కామన్‌గా దోమలుంటాయి. కానీ అవి కొందరిని మాత్రమే కుడుతుంటాయి. కొంతమంది మీద వాలినా వారిని కుట్టవు. వారి జోలికి అసలు వెళ్లవు. ఈ దోమలు నన్నే ఎందుకు కుడుతున్నాయని ఇతరులపై అరుస్తుంటతారు కూడా. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు. ఆ కారణాలేంటో తెలుసుకుందాం.

పంటలు పండించే ప్రాంతంలోనే దోమలు ఎక్కువగా ఉంటాయని అంటుండేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి పట్టణంవారికి వర్తిస్తున్నది. ఎందుకంటే టౌన్‌లో డ్రైనేజి సమస్య అధికంగా ఉంటుంది. దీనివల్ల దోమలు ఈమద్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నిరకాల స్ప్రేలు, కాయిల్సూ, జెల్‌, లిక్విడ్స్‌ ఇలా ఎన్ని వాడినా దోమల దాడి మాత్రం తప్పదు. ఏం చేసినా దోమలు పోవట్లేదులే అని కామ్‌గా ఉండేలేం. వీటివల్ల జికా, వెస్ట్‌ నైల్‌, మలేరియా, డెంగ్యూ… ఇలా రకరకాల వ్యాధులు కొత్తకొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇండ్లలోకి దోమలు రాకుండా ఉండాలంటే పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. నీరు నిల్వ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. దీనికో ఆప్షన్‌ ఉంది. దోమలు ఎక్కువగా ఎవరిని కుడతాయో తెలుసుకొని వారి వద్ద ఎక్కువసేపు ఉండకుండా ఉంటే సరిపోతుంది. దోమల నుంచి తప్పించుకొనేందుకు ఇవి పాటించండి.

డ్రెస్‌ :
దోమలకు పగలు పెద్దగా కళ్లు కనిపించవు. మధ్యాహ్నం నుంచి కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం కాగానే కళ్లు షార్ప్‌గా కనిపిస్తాయి. రాత్రిపూట ఎవరైతే డార్క్‌కలర్స్‌ బట్టలు ధరిస్తారో వారి వద్దకు వెళ్తాయి. కాబట్టి రాత్రిపూట లైట్‌కలర్‌ బట్టలు వేసుకుంటే బెటర్‌.

బ్లడ్‌గ్రూప్‌ :
‘ఓ’ బ్లడ్‌గ్రూప్‌ అంటే దోమలు ప్రీతి. వీరి మీదకు రెట్టింపు సంఖ్యలో దాడి చేస్తాయి. అదే ఎ,బి, గ్రూప్‌ వారిపై ఓ మోతాదు సంఖ్యలో దాడి చేస్తాయి.

గ్యాస్‌ :
సాధారణంగా మనుషులు ఆక్సిజన్‌ పీల్చుకొని కార్బన్‌డైయాక్సైడ్‌ వదులుతుంటారు. దోమలు దీనికి రివర్స్‌లో ఉంటుంది. కార్బన్‌డైఆక్సైడ్‌ను 160 అడుగుల దూరంలో నుంచి వాసనను పసిగడుతుంది. దీంతో అక్కడున్నవారి మీద వచ్చి వాలుతాయి. లావుగా, బరువుగా ఉన్నవారు ఎక్కువ కార్బన్‌డైయాక్సైడ్‌ ఎక్కువగా విడుస్తుంటారు. అందువల్ల వారి దగ్గరకు ఎక్కువ దోమలు వెళ్తాయి.

చెమట :
శరీరం నుంచి వచ్చే చెమటలో లాక్టిక్‌ యాడిస్‌, యూరిక్‌ యాసిడ్‌, అమ్మోనియా వంటివి ఉంటాయి. అవి దోమలకు చాలా ఇష్టం. ఎవరైనా బాగా శ్రమించి చెమట చిందిస్తే చాలు దోమలు పండుగ చేసుకుంటాయి. వాళ్లనే ఎక్కువగా కుడతాయి. అందువల్ల చెమట పట్టాక వెంటనే స్నానం చేయాలి.

చర్మం శుభ్రంగా :
శరీరంపై ఎలాంటి గాయలు ఉండకూడదు. చర్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉండే చర్మంపై దోమలు ఎక్కువగా వాలతాయి.

మందుబాబులంటే ఇష్టం :
వీరంటే దోమలకు అమితమైన ఇష్టం. ఎందుకంటే బాగా తాగిన తర్వాత దిక్కుతెలియకుండా పడిపోతారు. చెమట బాగా పడుతుంది. మత్తులో పడిపోతారు. దీంతో దోమలు వెంటనే వచ్చి వాలుతాయి. శరీరంలోని రక్తాన్ని పీల్చుకుంటాయి.

ప్రెగ్నెన్సీ : కడుపుతో ఉన్నవారు అధికంగా కార్బన్‌డైయాక్సెడ్‌ వదులతారు. దాంతో దోమలు ఎక్కువగా వీరిని కుడుతాయి. 21 శాతం అధికంగా కుడతాయి. ఆఫ్రికాలో ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకే ఎక్కువగా మలేరియా సోకుతుందని పరిశోధనల్లో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news