లోకేశ్ భర్త చంద్రబాబు అట.. చంద్రబాబు భర్త ఖర్జూర నాయుడు అట..!

మోదీ కూడా తన కన్నా జూనియరే అంటారు. మరి.. ఈ తప్పులు ఎలా చేశారు? తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే రకమైన మిస్టేక్ చేసి మళ్లీ నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు.

ఇప్పటికే ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎన్నోసార్లు అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నారా లోకేశ్ ను ఆడుకున్నంతగా ఇంకెవరని ఆడుకోలేదంటే అతిశయోక్తి కాదు. మరి.. లోకేశ్ కావాలని తప్పు చేస్తారో.. లేక తెలియనితనంతో చేస్తారో.. ఎందుకు అలా చేస్తారో అనే విషయం ఇప్పటికీ ఏపీ ప్రజలకు అర్థం కావడం లేదు. సరే.. నారా లోకేశ్ అంటే ఇక్కడ పెరిగిన వ్యక్తి కాదు. విదేశాల్లో చదువుకున్నారు.. విదేశాల్లో ఉద్యోగం చేశారు.. తెలుగు మాట్లాడటం కూడా ఆయనకు కొంచెం కష్టమే. ఈ తరుణంలో ఆయన తెలుగులో మాట్లాడుతూ తప్పులు చేయడం.. ఇతర తప్పులు చేయడం సహజం. కానీ.. చంద్రబాబుకు ఏం పోయే కాలం. ఈ దేశంలో నాకన్నా సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరూ లేరంటారు. మోదీ కూడా తన కన్నా జూనియరే అంటారు. మరి.. ఈ తప్పులు ఎలా చేశారు? తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే రకమైన మిస్టేక్ చేసి మళ్లీ నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. ఇంతకీ వాళ్లు చేసిన తప్పిదం ఏంటో తెలుసా?

త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కదా. టీడీపీ తరుపున మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ చేస్తున్నారు.. మరోవైపు చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు కదా. దానికి సంబంధించి నామినేషన్ ను సమర్పించారు ఇద్దరు. అందులో తప్పులు దొర్లాయి. అవి పేరుకు చిన్న తప్పులే అయినా.. బయటికి మాత్రం చాలా పెద్ద తప్పుల్లా కనిపిస్తాయి. అయితే.. వాళ్లు నామినేషన్ పత్రాలతో పాటు.. తమ ఓటు ఎక్కడుందో తెలిపే అధికారిక పత్రాన్ని కూడా నామినేషన్ పత్రాలతో సమర్పించారు. అందులోనే తప్పులు దొర్లింది.

అందులో నారా లోకేశ్ భర్త పేరు నారా చంద్రబాబు నాయుడంటూ ప్రింట్ చేసి ఉంది. చంద్రబాబునాయుడు భర్త పేరు ఖర్జూర నాయుడు అంటూ ప్రింట్ చేసి ఉంది. అయితే.. అధికారులు కూడా కనీసం దాన్ని చూడకుండానే సంతకాలు చేయడం గమనార్హం. ఈ పేపర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.