పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ రచయిత చిన్నికృష్ణ.. వీడియో

70 సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్రావాళ్లు, కేరళ వాళ్లు, ఇతర రాష్ట్రాల ప్రజలు వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన హ్యాపీగా బతుకుతున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఇక్కడ బతుకుతున్నారు.

తెలంగాణ ఏమన్నా పాకిస్థానా? తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కొడుతున్నారు.. హైదరాబాద్ లో ఆంధ్రా వాళ్లను బతకనీయరా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై తెలుగు రచయిత చిన్నికృష్ణ మండిపడ్డారు.

నేను, నా కుటుంబం, నా పిల్లలు తెలంగాణలో సంతోషంగా ఉన్నాం. నా కూతురును కూడా తెలంగాణకు చెందిన ఉన్నతమైన కుటుంబానికి ఇచ్చాను. మేం అంతా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం. అంత మిక్స్ అయిపోయాం. 70 సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్రావాళ్లు, కేరళ వాళ్లు, ఇతర రాష్ట్రాల ప్రజలు వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన హ్యాపీగా బతుకుతున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఇక్కడ బతుకుతున్నారు. ఇప్పుడు మీవల్ల ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. మీ వల్లనే ఇది.

దేశంలోనే టాప్ సీఎం కేసీఆర్.. తర్వాత కేటీఆర్..

తెలంగాణలో కేసీఆర్ అనే గొప్ప నాయకుడు ఉన్నారు. ఆయన భారతదేశంలోనే టాప్ సీఎం. ఆ తర్వాత రాబోయేది కూడా కేటీఆర్. వాళ్లిద్దరి సంరక్షణలో మేం ఉన్నాం. వాళ్లు మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. వాళ్లు ఎవరైనా సరే.. కూలీలు గానీ.. ఉద్యోగులు గానీ.. సినిమా వాళ్లు గానీ.. రైతు గానీ.. ఆటో డ్రైవర్ గానీ ఎవరైనా సరే.. వాళ్లను ఎంతో మంచిగా చూసుకుంటూ.. అన్నదమ్ములా కలిసి ఉందాం అని ఉద్యమ సమయం నుంచి చెబుతున్నట్టుగానే నెరవేర్చుకుంటున్న కేసీఆర్ ను మీరు విమర్శించడం ఎంత వరకు కరెక్ట్. ఇవాళ మేము ఒక్క పిలుపునిస్తే చాలు సెటిలర్స్ అంతా మీకు వ్యతిరేకంగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. మీ వ్యాఖ్యలపై మండిపడుతూ వేలమంది సెటిలర్స్ మాకు కాల్ చేశారని చిన్నికృష్ణ పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు.