
నయనతార.. లేడీ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు ఆమెను. మూడు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ ఓవైపు స్టార్ హీరోల పక్కన అవకాశాలు దక్కించుకుంటూ.. మరోవైపు లీడ్ రోల్‌లో ఎన్నో సినిమాలు చేస్తోంది. తాజాగా నయన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కొత్త మూవీ షూటింగ్ కోసం నయనతార విదేశాల్లో ఉండగా.. ఓ బుజ్జి ఫ్యాన్ వచ్చి తనతో ఫోటో దిగింది. ఆ చిన్నారికి రెండు మూడేళ్లు కూడా ఉండవు కానీ.. వచ్చి నయన్‌తో ఫోటో దిగి.. తనతో కాసేపు గడిపింది. నయన్ కూడా తనను హత్తుకొని కాసేపు ముచ్చటించింది. నయన్‌కు చిన్నారి ఫ్యాన్లు కూడా ఉన్నారా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏమనుకున్నారు మరి తలైవీ అంటే.