అక్కడ మర్యాద ఇస్తే చాలు..సగం రేటుకే ఫుడ్..

-

మాములుగా ఏదైనా రెస్టారెంట్ లేదా ఏదైనా ఫుడ్ కోర్ట్ కు వెళ్ళే వాళ్ళు డబ్బులు ఇస్తున్నాము కదా అని దురుసుగా ప్రవర్థిస్తారు..అందుకే తన రెస్టారెంట్‌కు వచ్చే వాళ్లంతా సిబ్బందితో కూడా మర్యాదగా ప్రవర్తించేలా చేయాలని అనుకున్నాడో యజమాని..రెస్టారెంట్లకు వచ్చే వాళ్లలో చాలామంది మర్యాదగానే ప్రవర్తిస్తారు. కానీ కొంతమంది ఒక్కోసారి హద్దు మీరుతుంటారు. అందుకే తన రెస్టారెంట్‌కు వచ్చే వాళ్లంతా సిబ్బందితో కూడా మర్యాదగా ప్రవర్తించేలా చేయాలని అనుకున్నాడో యజమాని.

అందుకు ఓ ఐడియా వేశాడు. ఇప్పుడిది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యూకేలోని ప్రీస్టన్‌లో ‘చాయ్ షాప్’ అనే రెస్టారెంట్‌ను ఈ ఏడాది మార్చి నెలలో ఉస్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి ప్రారంభించాడు. దీనిలో టీ, డోనట్లు, స్ట్రీట్ ఫుడ్స్, డిసర్టులు దొరుకుతాయి..కస్టమర్ల ప్రవర్తన ఆధారంగా బిల్లు ఉంటుందని అతను చెప్పాడు. ఇదే విషయాన్ని చెప్తూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు కూడా చేశాడు. రెస్టారెంట్ బయట ఉండే బోర్డుపై కూడా ఇదే విషయాన్ని రాశాడు. ఇంతకీ అతను ఏం రాశాడో ఓ సారి చూస్తే..

రెస్టారెంట్‌ లో టీ తాగాలని అనుకునే వాళ్లు.. ‘దేశీ చాయ్’ అని అడిగితే 5 యూరోలు (రూ.400) చెల్లించాల్సి ఉంటుందట. అదే ‘దేశీ చాయ్ ప్లీజ్’ అనడిగితే కేవలం 3 యూరోలకే (రూ.240) ఇచ్చేస్తాడట.ఇంకాస్త ‘హలో.. దేశీ చాయ్ ప్లీజ్’ అని ఆర్డర్ ఇస్తే టీ రేటు 1.9 యూరోలే (రూ.152) చార్జ్ చేస్తాడట ఉస్మాన్..అయితే ఇప్పటివరకు ఏ కస్టమర్ కూడా దురుసుగా ప్రవర్థించలేదని చెప్పాడు..ఇది నెట్టింట వైరల్ కావడంతో అందరు అతని ఆలోచనపై ప్రశంసలు కురిపిస్తున్నారు… ఇలా చెయ్యడం వల్ల అందరు అన్నీ చోట్ల మర్యాదగా ఉంటారని అతడి ఉద్దేశ్యం..

Read more RELATED
Recommended to you

Latest news