కొంపముంచిన క్రియేటివిటీ.. భగ్గుమంటున్న నెటిజన్లు..!!  

-

తినే వాటిని క్రియేటివ్‌గా చేస్తే.. కష్టమర్స్‌కు బాగా యట్రాక్ట్‌ అవుతుందని ఏ షఫ్‌ అయినా అనుకుంటారు.. అందుకే కదా.. మార్కెట్లో కలర్‌ఫుల్‌ చాక్లెట్స్‌, వెరైటీ బిస్కెట్లు ఉంటున్నాయి.. అలానే క్రియేటివ్‌గా ఆలోచించి కుకీస్‌ చేశారు. కానీ అవికాస్త..కొంపముంచాయి.. ఎందుకంటే..సమాజంలో సెన్సిటివ్‌ ఇష్యూస్‌ అయిన కులం, మతానికి లింక్‌ అయ్యేలా ఉండటమే ఇక్కడ మ్యాటర్. ది బేకింగ్ స్టూడియో (The baking studio).. ఓ ప్రైవేట్ సెరెమనీ కోసం.. బ్రాహ్మణ కుకీస్ తయారుచేసింది. ఆ కుకీస్‌పై బ్రాహ్మణులు జంధ్యం ధరించినట్లుగా కూడా ఉంది. ప్రత్యేక వేడుకల కోసం తాము ఇలాంటి కుకీస్ తయారుచేస్తామని ఆ సంస్థ తెలిపింది.
ఓ ప్రైవేట్ వేడుక కోసం వీటిని తయారుచేసినా.. ఓ కులానికి సంబంధించినట్లుగా అవి ఉండటంతో.. పెద్ద దుమారమే రేగింది. ట్విట్టర్‌లో నెటిజన్లు ఇచ్చిపడేస్తున్నారు.. కుల ఆధిపత్యం ప్రదర్శించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు” అని ఓ యూజర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటిపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుకీస్‌ చేసిన సంస్థ మాత్రం ఏదో గొప్ప పనిచేసినట్లుగా భావిస్తుంది. నిజానికి వీళ్లు క్రియేటివ్‌గా కుకీస్‌ చేస్తారు..
ఈమధ్య ఇలాంటిదే మరో వివాదం చెలరేగింది. ట్విట్టర్‌లో ప్యూర్-వెజ్ (పరిశుద్ధ శాఖాహారం) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. రెస్టారెంట్లు.. ఇలాంటి సందేశాలను ప్రదర్శించడంపై ఓ యూజర్ అభ్యంతరం చెప్పడంతో.. దీనిపై డిబేట్ జరిగింది. ఆ యూజర్ అభ్యంతరం ఏంటంటే… వెజ్ తినని వారు తింటున్న ఆహారం పరిశుద్ధమైనది కాదా అని ప్రశ్నించారు. నాన్-వెజ్ తినేవారిని అవమానపరుస్తున్నారని అనడంతో దీనిపై డిబేట్ కొనసాగి.. అప్పట్లో గోల గోల అయింది.
అందుకే మరీ క్రియేటివ్‌గా పోయి నిందలపాలు కావొద్దని అంకుల్స్‌ బ్యాచ్‌ సోషల్‌ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. మొత్తానికి ఆ కుకీస్‌ పెద్ద దుమారమే లేపాయి..

Read more RELATED
Recommended to you

Latest news