వీడి తెలివి తెల్లారా..ఇదేం పని రా బాబు..

-

కొంతమందికి కొన్ని రకాలు అంటే చాలా ఇష్టం, అది ఫుడ్ అయిన, వస్తువులైన..మరి కొంతమందికి ఏది తీసుకున్న బ్రాండ్ ఉండాలి అనుకుంటారు..దానికోసం ఎంత రిస్క్ అయిన చేస్తారు.మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తూ సంతోష పడుతుంటారు.ఇలాంటి మనస్తత్వం ఉన్న ఓ వ్యక్తి నైక్ బూట్లు అంటే చెప్పలేనంత ఇష్టం. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన బూట్లను కొనుగోలు చేసేవాడు. అయితే నెలల వ్యవధిలోనే మరిన్ని కొత్త కొత్త స్టైల్స్‌లో బూట్లు మార్కెట్‌లోకి విడుదల అవుతుండటంతో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు..అది కాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కోడుతున్నాయి.

అసలు విషయమేటంటే..బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి నైక్ బ్రాండెడ్ బూట్లంటే చాలా ఇష్టం. వాటిపై ఉన్న మక్కువతో కొత్త కొత్త స్టైల్స్‌లో షూలు మార్కెట్‌లోకి విడుదలైన వెంటనే వాటిని కొనుగోలు చేసేవాడు. అయితే.. అతడు కొనుగోలు చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మరికొన్ని కొత్త వేరియంట్ షూలు మార్కెట్‌లోకి విడుదల అవుతుండటంతో ఆర్థిక ఇబ్బుందులను సైతం పట్టించుకోకుండా వాటిని కూడా ఇంటికి తెచ్చేసుకునేవాడు. ఈ క్రమంలోనే విసిగిపోయిన అతడు.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు.

నైక్‌ షూ వేసుకున్నాననే భావన పొందేందుకు.. అచ్చం అదే స్టైల్లో తన కాళ్లకు టాటూలు వేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే యూకేలోని ప్రముఖ టాటూ ఆర్టిస్ట్ డీన్ గున్థర్‌ను సంప్రదించాడు..అతను దాదాపు ఎనిమిది గంటలు శ్రమించి అచ్చంగా షూ లా వుండే టాటూను వేశాడు.అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.అది చూసిన వారంతా ఇదేం పిచ్చి అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news