తెలంగాణలో కేసీఆర్ సర్కార్ విధ్వంసాల పేరుతో రాజకీయం చేస్తుందని విజయశాంతి మండిపడ్డారు. తాజాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటన దురదృష్టకరమని… ఆర్మీ విద్యార్ధులకు ఈ సమస్యతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్,ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈ విధ్వంసానికి పాల్పడ్డాయి. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. ప్లాన్ ప్రకారమే జరిగిందని అగ్రహించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలసి చేస్తున్న విధ్వంసం ఇది… ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని నిలదీశారు.
ఆర్మీ విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదు. అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాదు. కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటలు వినొద్దని బీజేపీ తరుపున విజ్ణప్తి చేస్తున్న… రాష్ట్రంలో శాంతిభద్రతాలు క్షీణించాయి. ప్రభుత్వమే విధ్వాంసాలను పెంచి పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనే లక్ష్యంతోనే కేసీఆర్ సర్కార్ వ్యవహిరిస్తుంది. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ సమావేశాల జరుగుతున్నాయి. వాటిని దృష్టి మరల్చేందుకే ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. కేసీఆర్ ఈ విధ్వంస రాజకీయలు చేయాలిని చూస్తే ప్రజలు ఊరుకోరు. తెలంగాణ ప్రజానీకమే నీ సర్కార్ ను బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు.