అమ్మో అమెరికా అల్లుళ్ళు వద్దు బాబోయ్‌ వద్దు..

-

ఒకప్పుడు అమెరికా సంబంధం అంటే ఎగిరి గంతేసే వాళ్లు.. ఇప్పుడు ఆ సంబంధాలంటేనే పారిపోతున్నారు. అమెరికా అల్లుళ్లంటేనే వద్దు బాబోయ్‌ అంటున్నారట మనోళ్లు..

అమెరికా అల్లుళ్లను వద్దంటున్నారు అమ్మాయిల తల్లి తండ్రులు… తాజాగా వెల్లడించిన ఒకసర్వేలో ఇదే విషయం వెల్లడైంది… గతంలో భారత్ లో అమెరికా అల్లుళ్ళు అంటే ఒక క్రేజ్ ఉండేది. తమ కూతురు ఎంతో సంతోషంగా విదేశాల్లో హాయిగా బ్రతుకుతుంది… డబ్బులకు లోటు ఉండదు… భవిష్యత్తు బాగుంటుంది అని భావించిన తల్లి తండ్రులు ఎక్కువగా అమెరికా, లండన్ సహా పలు దేశాల్లో పిల్లలను ఇవ్వడానికి ఆసక్తి చూపించే వారు. అయితే… ఇప్పుడు ఆ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది అంటున్నారు పరిశీలకులు…

తాజాగా ముంబై కి చెందిన ఒక విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ఆడపిల్లల కుటుంబాల మీద వాళ్ళు పలు కాలేజీల్లో సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేల్లో 57 శాతం మంది అసలు తమ అమ్మాయిని విదేశాల్లో ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదట, అక్కడికి వెళ్లిన తర్వాత పని ఒత్తిడితో భర్తలు భార్యలకు చుక్కలు చూపిస్తున్నారని, ఇక అక్కడకు పంపిస్తే ప్రాణాలకు కూడా ఏ మాత్రం నమ్మకం లేదని, ఇక్కడే ఉండి మంచి ఉద్యోగం లేదా ఆస్తి ఉంటే చాలు అని అభిప్రాయపడ్డారట.

మరి కొంత మంది అయితే తమకు, బాగా తెలిసిన వాళ్ళు అయితేనే అమెరికాలో సంబంధం ఇస్తామని లేకపోతే ఇవ్వమని చెప్పేశారట. మరికొందరు అయితే… అమెరికా ఉద్యోగం కంటే ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగమే మంచిది అని చెప్పారట… 4 శాతం మంది అయితే… ఆస్తి లేకపోయినా పర్వాలేదు ప్రభుత్వం ఉద్యోగం ఉంటే చాలని, అబ్బాయి మంచి వాడు అయితే ఇల్లరికం అయినా చేసుకుంటామని అంటున్నారట. ముఖ్యంగా విదేశాల్లో సంబంధానికి మాత్రం మెజారిటీ తల్లి తండ్రులు అసలు అంగీకరించలేదని సర్వే బృందానికి నేతృత్వం వహించిన పంకజ్ గోవాల్కర్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ సర్వే నిర్వహించినట్టు ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news