షాకింగ్ లుక్ లో కనిపించనున్న బన్నీ…..!!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జనవరి 2020, 12 న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ సీనియర్ నటి టబు మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, మురళి శర్మ, రాహుల్ రామకృష్ణ, నవదీప్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో  హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఈ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇకపోతే గంధం చెక్కల మాఫియా చుట్టూ తిరుగుతూ, రివెంజ్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో భారీ స్థాయి యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నాడట. అందుకోసం ఆయన అప్పుడే తన శరీరాన్ని దృఢంగా తయారుచేయటానికి సిద్ధమైనట్లు సమాచారం. అది మాత్రమే కాక, కొద్దిపాటి గడ్డంతో రఫ్ లుక్ లో బన్నీ ఈ సినిమాలో కనిపించబోతున్నారని అట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. రష్మిక మందన్న బన్నీతో స్టెప్పులేయనుంది.

గతంలో బన్నీ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా సూపర్ హిట్ కొట్టగా, తరువాత వచ్చిన ఆర్య 2 మాత్రం ఫెయిల్ అయింది. ఇక ఎట్టి పరిస్థితిలో బన్నీతో చేస్తున్న ఈ సినిమాతో హిట్ కొట్టాలని సుకుమార్ ఎంతో పవర్ ఫుల్ గా ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నారట. మరికొద్ది రోజుల్లో విదేశాల్లో తొలి షెడ్యూల్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా, రిలీజ్ తర్వాత ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో వేచిచూడాలి…..!!

Read more RELATED
Recommended to you

Latest news