Ntr birthday special :ఎన్టీఆర్ సినీ కేరీర్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

-

నందమూరి నటవారసుడు ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తండ్రీ ప్రోత్సహంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. ఆయన మంచి తనమే ఎన్టీఆర్ సక్సెస్ కు కారణం అని ఆయన అభిమానులు అంటున్నారు.. ఎన్టీఆర్ పేరు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ లో జోష్ వస్తుంది.. తాతకు తగ్గ మనువడు అనిపించుకొని ఇప్పుడు వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యారు.. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. ఆయన గురించి మరిన్ని విషయాలు మీకోసం..

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు. తారక్‌ బర్త్‌ డే సందర్భంగా సోషల్ మీడియా మోత మోగిపోయింది. ఒకటీ, రెండూ. కాదు ఏకంగా పదుల సంఖ్యలో హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయంటేనే ఎన్టీఆర్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.. దర్శకుడు రాజమౌళి తెరకేక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ప్రపంచమంతా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.. ఎన్టీఆర్ ఎప్పుడు వివాదాలకు పోడు.. తన పనేంటో తాను చేసుకుంటూ వస్తాడు..19 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ స్టార్ డమ్‌ను రుచి చూశాడు.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతోనూ సతమతమయ్యాడు…

సినీ కెరీర్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఉత్తానపతనాలను చవిచూశాడు… ఆది బ్లాక్ బ్లస్టర్‌తో మొదలైన ఎన్టీఆర్ స్టార్‌డమ్ ఆర్ఆర్ఆర్‌తో మరింత పీక్స్‌కి చేరింది. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోగా ఎన్టీఆర్ కొనసాగడమే ఇందుకు కారణం అనే చెప్పాలి.. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు.. సోషల్ మీడియాలో ఇప్పటికే తారక్ పుట్టినరోజు సందర్బంగా ఫోటోలను, సినిమా క్లిప్ లను షేర్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.. సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఇక ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా కొరటాలా దర్శకత్వం లో తెరకేకుతున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు..అంతేకాదు ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.. అలాగే బాలివుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.. ఇలాగే మరెన్నో సినిమాలు జనాలకు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్..

Read more RELATED
Recommended to you

Latest news