ఈ పాము విలువ అక్షరాలా 9 కోట్లు..!

-

One Arrested With Rare Snake Species Worth Rs. 9 Crore In Bengal

షాకయ్యారా? కళ్లు బైర్లుకమ్ముతున్నాయా? మనుషులం మనకే అంత రేటు పలకదు. ఆఫ్టరాల్ పాముకు అంత రేటా? అన్ని కోట్లా? ఏముంది ఆ పాములో. అసలు 9 కోట్ల రూపాయలు పెట్టి ఆ పామును కొని ఏం చేసుకుంటారు అని అంటారా? వాళ్లు దాన్ని ఏం చేసుకుంటారో తెలియదు కానీ.. దాని రేట్ మాత్రం అంతే.

ఎందుకు దానికి అంత రేటు అంటే.. అది చాలా అరుదైన జాతికి చెందిన పాము. తక్షక్ జాతి అంట. దాన్నే గెక్కో అని కూడా అంటారట. అది వెస్ట్ బెంగాల్‌లోని మల్దా అటవీ ప్రాంతంలో నివసిస్తుందట. కోల్‌కతాకు చెందిన షేక్ అనే వ్యక్తి దాన్ని పట్టుకొని జార్ఖండ్‌కు చెందిన స్మగ్లింగ్ ముఠాకు దాన్ని అమ్మడానికి తీసుకెళ్తుండగా.. పోలీసులు అనుమానం వచ్చి అతడి బ్యాగును చెక్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ పాములు అత్యంత విషపూరితమైనవట. ఒక్కసారి కాటేస్తే ఇక అంతే.. ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. ఈ పాముల నుంచి సేకరించిన విషాన్ని కొన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట. అందుకే వీటికి అంత డిమాండ్.

Read more RELATED
Recommended to you

Latest news