నిశబ్ధప్రాంతం.. గుండెచప్పడు, ఊపిరితిత్తుల సౌండ్స్ కూడా వినిపిస్తాయి.. కానీ అక్కడ ఉండలేరు..!

-

పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ.. మనం ఎన్నో శబ్ధాలు వింటాం.. మదిలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మనలో మనమే మాట్లాడుకుంటాం. ఇలా ఒకటా రెండా.. వంటగదిలో కుక్కర్ సౌండ్ , హాల్లో టీవీ, బయట బండి, ఆఫీస్ లో కొలీగ్స్, ఇలా రకరకాల శబ్ధాలమధ్య బతుకుతున్నాం కదా. ఎంత నిశబ్ధంగా ఉండాలాన్న ఏదో ఒక శబ్ధం వస్తుంది. అయితే అత్యంత నిశ్శబ్ధమైన ప్రాంతం ఒకటి ఉంది. అక్కడికి వెళ్లి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారేమో.. కానీ అక్కడ ఎక్కవ సేపు ఉండలేరట. ఒకవేళ మీరు ఎక్కువ సేపు ఉందాం అని ట్రై చేస్తే.. పిచ్చెక్కే ప్రమాదం ఉంది.

యూఎస్‌లో మిన్నెసోటాలోని మిన్నెపోలీస్‌లో ఏర్పాటు చేసిన ఒర్ఫిల్డ్‌ లేబొరేటరీస్‌లో అత్యంత నిశ్శబ్దమైన చోటు ఒకటి ఉంది.. ఈ ల్యాబ్‌లో ఓ ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులోని గోడలు బయటి శబ్దాలను లోపలకు రానివ్వవు. లోపల శబ్దాలు -9.4 డెసిబెల్స్‌గా ఉంటుందంటే నమ్ముతారా? కానీ, అదే నిజం. ఇందులోకి వెళ్లారంటే..బయట శబ్ధాలు ఏమీ మీకు వినిపించవు. మన లోపల అవయవాలు చేసే శబ్దాలు వినిపిస్తాయి. గుండె చప్పుడు, ఊపిరితిత్తులు చేసే శబ్దాలు స్పష్టంగా వినవచ్చు.

ఉదరంలో జరిగే ప్రక్రియలో భాగంగా వెలుబడే శబ్దాలు సైతం చక్కగా వినిపిస్తాయి. భలే ఉందికదా.. ఈ సౌండ్స్ ఎలా ఉంటాయో వింటే. అందుకే ఈ ఛాంబర్‌లోకి వెళ్లిన వారు 45 నిమిషాలకు మించి ఉండలేరు. శరీరంలో నుంచి వచ్చే శబ్దాలు వింటుంటే పిచ్చి పట్టినట్టుగా అవుతుందట.

అసలు ఎందుకు ఇది తయారు చేశారు.?

 

వివిధ సంస్థలు ఉత్పత్తి చేసే ఆడియో పరికరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం కోసం, నాణ్యమైన శబ్ద పరికరాలను తయారు చేయడం కోసం ఈ ఛాంబర్‌ను ఉపయోగిస్తారు. అలాగే అంతరిక్షంలో ఉండే నిశ్శబ్దానికి అలవాటు పడటం కోసం వ్యోమగాములు ముందుగా ఈ ఛాంబర్‌లో ఉండి శిక్షణ తీసుకుంటారట. అయితే.. ఈ ఛాంబర్‌ సాధారణ ప్రజలకు సైతం అందుబాటులో ఉండటంతో ఇదో పర్యాటక ప్రాంతాగా మారిపోయింది.

మైక్రోసాప్ట్ కూడా..

మైక్రోసాఫ్ట్‌ కూడా ఇదే బాటలో.. తమ సంస్థ ఉత్పత్తి చేసే ఆడియో పరికరాల పనితీరును పరీక్షించడం కోసం అమెరికాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో అత్యంత నిశ్శబ్దమైన ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకుంది. దీంతో ప్రపంచంలో అత్యంత నిశ్శబ్దమైన ప్రాంతంగా గిన్నిస్‌బుక్‌లో రికార్డు సాధించింది. అంతకుముందు వరకు ఈ రికార్డు ఒర్ఫిల్డ్‌ లేబొరేటరీస్‌ కే ఉండేది.

Read more RELATED
Recommended to you

Latest news