కేవలం వాటితోనే ఓమిక్రాన్ కు చికిత్స… కోలుకుంటున్న బాధితులు.

-

దేశంలో ఓమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 18 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 400ను దాటింది. రానున్న రెండు వారాల్లో కేసుల సంఖ్య వెయ్యిని కూడా దాటుతుందని నిపుణులు అంచానా వేస్తున్నారు.

ఇంతలా ప్రజల్ని భయపెడుతున్న ఓమిక్రాన్ పెద్దగా లక్షణాలు చూపించడం లేదు. ఓమిక్రాన్ బాధితుల్లో చాలా మందికి కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. పెద్దగా చికిత్స లేకుండానే.. బాధితులు కోలుకుంటున్నారు. ఓమిక్రాన్ ప్రాణాంతకం అంటూ భయపడుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రి వైద్యులు.

ఇప్పటి వరకు ఓమిక్రాన్ బాధితులకు కేవలం మల్టీ విటమిన్లు, పారాసెటమల్ ట్యాబ్లెట్ల ద్వారానే చికిత్స అందించామని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. చాలా మంది ఔషధాలు వాడకుండానే కోలుకుంటున్నారని తెలిపారు. ఆస్పత్రిలో ఇప్పటి వరకు 51 మంది ఓమిక్రాన్ బాధితులు చేరితే.. 40 మంది ఓమిక్రాన్ ను జయించి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి ఆక్సిజన్ సపోర్ట్, స్టెరాయిడ్లు,  రెమిడెసివిర్ ఇంజక్షన్ల అవసరమే రాలేదన్నారు వైద్యులు.

 

Read more RELATED
Recommended to you

Latest news