దేశంలోనే ఆ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారట.. 16 ఏళ్లకే సంపాదన

-

ఈ రోజుల్లో సంతోషంగా ఎవ్వరూ లేరు.. అందరికీ ఏదో ఒక బాధలు, ఆలోచనలు.. ఎవరి రేంజ్‌కు ఉండే సమస్యలు వారి రేంజ్‌కు ఉన్నాయి. మన ఇంట్లోనే అనేక సమస్యలు ఉంటే.. ఇంక ఊర్లో ఎన్ని, జిల్లాలో ఇంకెన్నీ, రాష్ట్రంలో ఎన్ని.. కానీ అసలు సంతోషకరమైన రాష్ట్రం ఏంటో మీకు తెలుసా..? ఆ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉంటారట. అదేలా సాధ్యం అనుకుంటున్నారా..? ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటంటే..

 

దేశంలోని అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం రికార్డు సృష్టించింది. గుడ్‌గావ్‌లోని Management Development Institute నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సంతోషంలోనే కాదు. అక్షరాస్యతలోనూ ఈ రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలిచింది. అంతకు ముందు కేరళ రాష్ట్రం అత్యధిక లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రంగా ఉండగా…ఇప్పుడు మిజోరం కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. 100% అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో రికార్డు సాధించింది. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ విద్యార్థులకు అర్హతల ఆధారంగా ఉపాధి అవకాశాలు చూపించడంలో ముందంజలో ఉంది మిజోరం.

ఎలా ప్రకటించారు..

మొత్తం ఆరు ప్రమాణాల ఆధారంగా మిజోరంను “హ్యాపియెస్ట్ స్టేట్‌”గా ప్రకటించారు. ఫ్యామిలీ రిలేషన్స్, వర్క్ రిలేటెడ్ అంశాలు, సామాజిక స్పృహ, దాతృత్వం, మతం, సంతోషకర జీవితంపై కరోనా ప్రభావం ఎంత..? ఫిజికల్, మెంటల్ హెల్త్…ఇలా అన్ని కోణాల్లోనూ సర్వే నిర్వహించారు. ఈ రిపోర్ట్‌పై కొందరు విద్యార్థులు స్పందించారు. తమకు ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఎదుర్కొని నిలబడినట్టు చెప్పారు.

మిజోరంలోని పిల్లల సంపాదించే వయసు కన్నా ముందుగానే డబ్బు సంపాదించగలుగుతున్నారు. ఎంప్లాయ్‌మెంట్‌ అక్కడ అంత బాగుందట. 16,17 ఏళ్లకే ఏదో ఓ ఉద్యోగంలో చేరిపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడి వాళ్లందరికీ ఆర్థిక స్వేచ్ఛ ఉన్నట్టు రిపోర్ట్ స్పష్టం చేసింది. వాళ్ల ఆనందానికి ఇది కూడా ఓ కారణమే అని వివరిస్తోంది. చిన్నతనంలోనే ఇండిపెండెంట్‌గా బతకడం అలవాటవుతోందని చెబుతోంది. ఇక భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్దలుంటే వెంటనే విడిపోతున్నారు. ఎవరి దారిలో వాళ్లు ప్రశాంతంగా బతుకుతున్నారు. పగ, ప్రతీకారాలు అంటూ ఏమీ ఉండవు..

Read more RELATED
Recommended to you

Exit mobile version