వైరల్ అవుతున్న పిజ్జా కోన్..!

సాధారణంగా మనం పిజ్జాని తింటూ ఉంటాం. అయితే ఆ పిజ్జా ఆకారం ఎప్పుడు రౌండ్ గా ఉంటుంది. ఆ రౌండ్ గా వున్నా పిజ్జా లో స్లైస్ ని తీసుకొని తింటుంటాం. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ ఈ పిజ్జాని చూశారంటే షాక్ అవుతారు. ఎందుకంటే మనం ఎక్కడ తిన్నారా రౌండ్ గా వింటే పిజ్జా ఇక్కడ మాత్రం చూడడానికి ఐస్ క్రీమ్ లాగ ఉంది. అయితే మరి ఈ వెరైటీ పిజ్జా గురించి ఒక లుక్ వేయండి.

ఐస్క్రీమ్ మాదిరిగా ఉండే పిజ్జా ఇప్పుడు వైరల్ అవుతోంది. చూడడానికి అచ్చం ఐస్క్రీం లాగే ఉంది. గతంలో పుచ్చకాయ తో చేసిన పిజ్జా వైరల్ అయితే ఇప్పుడు ఐస్ క్రీం మాదిరిగా ఉండే పిజ్జా వైరల్ అవుతోంది. ఈ పిజ్జా ని కోన్ ఆకారంలో తయారు చేశారు. పిజ్జా పిండితో దీనిని చేసి దాని మీద సాస్ మరియు చీజ్ ని వేశారు.

ప్రతి సారి కూడా ఏదో ఒక కొత్త రకం వెరైటీలు ఇలా బయటకు వచ్చి ట్రెండ్ అయ్యిపోతాయి. ఈసారి ఇది వచ్చింది. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయిపోతుంది. దీని పేరు కోనో పిజ్జా. ఇలా తినడం వల్ల చీజ్ కానీ సాస్ కానీ మన బట్టలు మీద పడదు. మొదట ఈ దీనిని చీజ్ తో ఫిల్ చేసి.. నెక్స్ట్ చీజ్ ని వేసి చేస్తారు.