హుజురాబాద్ లో ఈటెలతో రేవంత్ ఫిక్సింగ్.. టిఆర్ఎస్ సంచలన ఆరోపణలు

-

కాంగ్రెస్ బీజేపీలు కలవయ‌న్న‌ది చ‌రిత్ర అని, కానీ హుజూరాబాద్‌లో మాత్రం చీక‌టి ఒప్పందాలు చేసుకుంటున్నార‌ని ఈటల రాజేంద‌ర్‌, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చీక‌టి ఒప్పందాలు చేసుకుంటున్నార‌ని టీఆర్‌ఎస్ నాయ‌కుడు ఆరోపించారు. హుజూరాబాద్ రాజకీయం హీటెక్కుతోంది. ఎలాగైనా గెలువాల‌ని అధికారంలో ఉన్నటీఆర్‌ఎస్ భావిస్తే, బీజేపీ గ‌ట్టీ పోటీనిస్తోంది. ఇప్పటికే త‌మ మాట‌ల‌తో వేడిని ర‌గిలిస్తున్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌కి చేసిందేంట‌ని, ఆయన్ను గెలిపించ‌డం వ‌ల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని మంత్రి హరీశ్ రావు ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు. మామ మెప్పు కోసం హరీశ్ ఇంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడ‌ని ఈటల అదే స్థాయిలోనే తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ గా ఇన్‌చార్జిగా వ్యవహరించిన కౌశిక్ రెడ్డి ఈటల రాజీనామా త‌రువాత ఎవ‌రూ ఊహించ‌ని స్థితిలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

revanth reddy etela rajenderచేర‌డంతోనే ఎమ్మెల్సీ పదవికి ద‌క్కించుకున్నారు. ఈ రెండు పార్టీల వ‌ర‌కు ఓకే గానీ హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితే ఎవ‌రికీ అర్థం కావ‌డంల లేదు. దీనికి ప్రధాన కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కారణమ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కౌశిక్ రెడ్డి. ఈటలతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారంటూ సంచలనంగా మాట్లాడారు. ఈటల రాజేందర్, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నార‌ని కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనకు సహకరించాలని ఈటల రేవంత్ రెడ్డిని కోరారని. ఇద్దరూ కుమ్మక్కయ్యారని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఈటల భారీ ప్యాకేజీ ఇచ్చారని ఆరోపించారు. అందుకే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థిని పెట్ట‌డం లేద‌ని తెలిపారు. జిల్లా నాయకులు కూడా ఇటువైపు రావ‌డం లేదన్నారు. ఎన్నికలు అయిపోయిగానే ఈటల రాజేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నార‌ని జోస్యం చెప్పారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తూ ఎక్కడా ఈటల రాజేందర్ ఎక్కడా ఆ పార్టీ పథకాలు చెప్పడం లేదని విమ‌ర్శించారు. కాంగ్రెస్ వాళ్లు ప్ర‌వేశ పెట్టిన పథకాలు బాగున్నాయంటున్నారని దీని వెనుక మ‌త‌ల‌బు ఏంట‌ని ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news