దూరదర్శన్ లో రామాయణం స్పందన ఒక రేంజ్ లో ఉందిగా, ఇంత మంది చూస్తున్నారా…?

-

దూరదర్శన్ లో రామాయణం మరియు మహాభారత్ తిరిగి ప్రసారం ప్రారంభించి మూడు వారాలు దాటింది. ప్రసార భారతి ప్రేక్షకులను లాక్ డౌన్ లో ప్రేక్షకులను తమ వైపుకి తిప్పుకోవడానికి గానూ… వీటిని తిరిగి ప్రారంభించారు. దీనికి మంచి స్పందన వస్తుంది ఛానల్ లో. ఛానెల్ దీన్ని తిరిగి మొదలుపెట్టిన నాటి నుంచి బంపర్ రేటింగ్స్ పొందుతోంది. బార్క్ ఇండియా పంచుకున్న డేటా ప్రకారం, 14 వ వారంలో అన్ని జిఇసిలలో,

డిడి నేషనల్ మొత్తం వీక్షకుల సంఖ్య 1.9 బిలియన్ గా ఉంది. డిడి భారతి 51 మిలియన్ వీక్షకులను పొందింది. డిడి నేషనల్ వరుసగా రెండు వారాలు భారత్ లోని వాచ్ జిఇసిలో నంబర్ వన్ గా నిలిచింది. గత వారం 1.5 బిలియన్ వీక్షకులతో సొంత వీక్షకుల రికార్డును అధిగమించింది. ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్ గణాంకాలను షేర్ చేసారు. వీక్షకులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

“రామాయణానికి రికార్డ్ వ్యూయర్ షిప్ కొనసాగుతోంది. భారతదేశం అంతటా ఉన్న డీడీ నేషనల్ వీక్షకులందరికీ ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు. రామాయణం, మహాభారతం వంటి పౌరాణిక కార్యక్రమాలతో పాటు, దూరదర్శన్ థ్రిల్లర్, డ్రామా మరియు కామెడీ షోలను బయోమ్కేశ్ బక్షి, బునియాద్ మరియు దేఖ్ భాయ్ దేఖ్ వంటి వాటిని తిరిగి ప్రేక్షకుల కోసం తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news