హైదరాబాద్ లో బామ్మ కరోనా 34 మందికి సోకింది…!

-

కరోనా వైరస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అది మాత్రం దాని పని అది చేసుకుంటూ పోతుంది. కట్టడి చేస్తున్న కొద్దీ అది చెలరేగిపోతుంది గాని అది మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని తలాబ్‌కట్టలో కరోనాతో 70 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఆ బామ్మ నుంచి దాదాపు 34 మందికి కరోనా వచ్చిందని గుర్తించారు.

ఆమెకు వైద్యం చేసిన డాక్టర్, ఇద్దరు నర్సులకూ వైరస్‌ వచ్చింది. గాంధీ మెడికల్‌ కాలేజీలో డేటా ఎంట్రీ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌‌గా తెలిసింది. ఇక ఇదిలా ఉంటే బంజారాహిల్స్‌లో 12ఏళ్ల బాలికకు కూడా కరోనా సోకింది. మర్కజ్‌ వెళ్లొచ్చిన తండ్రి నుంచి కూతురికి వైరస్‌ సోకగా… కుత్బుల్లాపూర్‌ పరిధిలో ఏడాదిన్నరేళ్ల బాలుడికి కరోనా వచ్చింది. ఆ బాలుడి తాత కూడా కరోనా వచ్చి చనిపోయారు.

ఆయన నుంచే ఆ బాలుడికి కరోనా వచ్చింది. అతడి ద్వారానే బాలుడికి కరోనా సోకిందని అధికారులు గుర్తించారు. ఇప్పుడు వీళ్ళ నుంచి ఎవరు ఎవరికి కరోనా వచ్చింది అనే దాని మీద అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనే దాదాపు 500 కరోనా కేసులు ఉండటంతో తెలంగాణా సర్కార్ అప్రమత్తమైంది. లాక్ డౌన్ ని కతినంగా అమలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news