వామ్మో! ఏం చెప్తిరి : రిపబ్లిక్ డే అంటే పంద్రాగ‌స్టు!

-

1950, జ‌న‌వ‌రి 26 రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చిన రోజు.. స‌ర్వ‌స‌త్తాక రాజ్యం. సార్వ‌భౌమాధికారంతో వెలిగే రాజ్యం..లౌకిక రాజ్యం..గ‌ణ‌తంత్ర రాజ్యం..భార‌త దేశం .. ఓ ప్ర‌జాస్వామ్య రాజ్యం అని ఓ స‌మ‌గ్ర నిర్వ‌చనం మ‌న‌కు మ‌నం ఇచ్చుకున్న రోజు.. ప్ర‌క‌టించుకున్న రోజు.. రాజ్యాంగాన్ని ఆ రోజు నుంచి అమ‌లు చేసిన రోజు.కానీ మ‌న కుర్ర‌కారుకు ఇవేవీ అక్క‌ర్లేదు. వాళ్ల‌కు ఫిజ్జాలు బ‌ర్గ‌ర్లు త‌ప్ప దేశం అన్నా దేశ నాయ‌కులన్నా వాళ్ల‌కు ఏమీ ప‌ట్ట‌దు. ఆర్ఆర్ఆర్ అప్డేట్ మాత్రం కావాలి. ఎందుకంటే ఆ సినిమాతోనే వీళ్ల దేశ‌భ‌క్తి ఎంత‌న్న‌ది త‌ప్ప‌క ప్రూవ్ అవుతుంది.

గ‌ణతంత్ర దినోత్స‌వం అంటే ఏంటి? అబ్బో! ఈ ప్ర‌శ్న మాత్రం మ‌న హైద్రాబాదీల‌ను అడ‌గ‌కండి. వాళ్లు పానీపూరీ తిన‌డంలో ఎక్స్ ప‌ర్టులు.. వాళ్లు స్టైల్ కు ఐకాన్లుగా నిల‌బ‌డ‌డంలో టాప్ మోస్ట్ జీనియ‌స్ లు..వాళ్లు ఐ మ్యాక్స్‌ల చుట్టూ తిర‌గ‌డంలో సాటిలేని వీరులు.. వారు హైస్పీడు కుర్రాళ్లు..హై ఫై కుర్రాళ్లు..హైటెక్కు అమ్మాయిలు..కానీ వీళ్ల‌కు క‌నీసం నిన్న‌టి రోజు ప్రాధాన్యం కూడా తెలియ‌దు..క‌నుక సిగ్గుతో త‌ల‌దించుకుని వెళ్లిపోదాం.

మ‌న రాజ్యాంగం మ‌న‌కు ప్ర‌సాదించిన హ‌క్కులేంటో వీళ్ల‌కు తెలియ‌దు స‌రి క‌దా! అస‌లు మ‌న రాజ్యాంగం ఎప్ప‌టి నుంచి అమ‌లులోకి వ‌చ్చింది.. దాని రూప‌క‌ర్త పేరు కూడా వీరికి తెలియ‌దు అని చెప్పుకోవ‌డం సిగ్గు చేటు.దౌర్భాగ్యం. భార‌త మాతా! మ‌మ్మ‌ల్నిక్ష‌మించు..ఇంత‌కుమించి ఏమీ అన‌లేం అడ‌గ‌లేం వీళ్ల‌ను.ఇంత చేత‌గాని యువ‌త దేశాన ఉంది అని అనుకోవ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేం..

indian Flag and Indian Flag history
indian Flag and Indian Flag history

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నిన్న‌టి వేళ చాలా అంటే చాలా అనేంత స్థాయిలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.మూడు ద‌శ‌లలో క‌రోనాను దాటిన సంతృప్తి వైద్య రంగంలో కాస్తో కూస్తో మిగిలే ఉంది.ఇప్ప‌టికే ఒమిక్రాన్ దాడి కొన‌సాగుతూనే ఉన్నా కూడా మ‌ర‌ణాలు చెప్పుకోద‌గ్గ రేటులో లేవు.అదేవిధంగా రిక‌వ‌రీ రేటు చాలా అంటే చాలా బాగుంది. అంతేకాదు వైద్యుల చుట్టూ రోగులు తిరిగే రోజులు కూడా లేవు. ఇదే ద‌శ‌లో మ‌న యువ‌త ఇంత‌టి హ్యాపీనెస్ ను ఏ విధంగా దూరం చేసిందో చూద్దాం.

నిన్న‌టి వేళ ఓ ఛానెల్ నిర్వాహ‌కులు వినూత్నంగా హైద్రాబాద్ రోడ్ల‌పై న‌డ‌యాడుతున్న యువ‌త‌కు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం అంటే ఏంటి? మీకు తెలుసా? అని అడిగిన ప్ర‌శ్న‌కు చాలా మంది తిక్క తిక్క స‌మాధానాలు ఇచ్చారు. అస‌లు వీళ్ల‌కు ఏం తెలుసో తెలుసుకోవాలన్న ఉత్సాహం అన్న‌ది ఇక‌పై ఉండ‌కూడ‌ద‌ని అనేలా అనుకునేలా చేశారు.దేశాన్ని ప్రేమించే పౌరులంతా వీళ్లు అని ఎలా అనుకోగ‌లం. ఇక్క‌డ పుట్టారు క‌నుక ఇక్క‌డ వాతావర‌ణంలో పెరిగారు క‌నుక క్ష‌మించి వ‌దిలేయ‌డం త‌ప్ప వీళ్లు జ‌వాబులు వింటే ఎవ్వ‌రైనా కోపంతో ఊగిపోవాల్సిందే.

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం అంటే ఏంటి అని అడిగితే పంద్రాగ‌స్టు అని చెప్పారు కొంద‌రు. స్వాతంత్ర్యం వ‌చ్చిన రోజు అని చెప్పారు కొంద‌రు.ఇంకా ఇంకొంద‌రు ఏవేవో నోటికి వ‌చ్చిన విధంగా చెప్పారు. ఒక‌రో ఇద్ద‌రో భార‌త రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చిన రోజు అని చెప్పారే త‌ప్ప మిగిలిన వారంతా మ‌రీ ఘోరంగా రిప‌బ్లిక్ డే అంటే గాంధీ జ‌యంతి అని కూడా చెప్పారు. ఇంత‌కు మించిన అన్యాయం ఏమ‌యినా ఉందా?

Read more RELATED
Recommended to you

Latest news