T20 ప్రపంచకప్ నుంచి రోహిత్‌ శర్మ ఔట్‌ ?

-

T20 ప్రపంచకప్ నుంచి రోహిత్‌ శర్మ దూరం కానున్నాడా..అంటే అవుననే సమాచారం అందుతోంది. తాజాగా బీసీసీఐ సెక్రెటరీ జైషా కీలక వాక్యాలు చేశాడు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం, కెప్టెన్ రోహిత్ శర్మను వచ్చే టి20 ప్రపంచకప్ లో ఎంపిక చేసే విధానం స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు పెసర్ మహమ్మద్ షమీ గాయాల గురించి జైషా మాట్లాడాడు.

Rohit Sharma out of T20 World Cup

అయితే టి20 ప్రపంచకప్ వరకు మాత్రమే కాకుండా కోచ్ గా ద్రవిడ్ ను మరికొంతకాలం ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుందని జైషా తెలిపాడు. ప్రస్తుతం ద్రవిడ్ టీమిండియాతో సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్నాడు. అది ముగిసిన తర్వాత ద్రవిడ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జైషా వెల్లడించాడు. అయితే పొట్టికప్ లో రోహిత్ స్థానం గురించి గ్యారెంటీ ఇవ్వలేమని జైషా అన్నాడు. దీంతో రోహిత్ దూరం కానున్నాడని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news