ఆ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన సమంత.. ఆయనకు ఓటు వేసి గెలిపించండి అంటూ వీడియో రిలీజ్

-

ప్రత్యూష ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా సమంత పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నది కదా. ఆ ఫౌండేషన్ లోనే డాక్టర్ మంజూల కూడా పని చేస్తోంది. అలా వాళ్లిద్దరికీ లింక్ కుదిరింది అన్నమాట.

అవును.. ఎన్నికల వేళ సమంత రిలీజ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని కుటుంబం రాజకీయాలకు దూరం. వాళ్లు ఏ పార్టీకి మద్దతు ఇవ్వరు. కాకపోతే.. అక్కినేని కోడలు సమంత మాత్రం ఓ అభ్యర్థికి డైరెక్ట్ గా మద్దతు పలికింది. ఓ అభ్యర్థి తరుపున ట్విట్టర్ లో ప్రచారం చేసింది.

Samantha released video to support mla candidate in ap

ఆయనకు ఓటేయాలంటూ వీడియోను రూపొందించి ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఇంతకీ ఎవరా అభ్యర్థి అనేగా మీ డౌట్.

ఆయన టీడీపీ నుంచి రేపల్లెలో పోటీ చేస్తున్న సత్య ప్రసాద్. ఆయనకు ఓటేసి గెలిపించాలంటూ ఆ వీడియోలో సమంత చెప్పింది. ఇంతకీ ఈ సత్య ప్రసాద్ కు, సమంతకు ఉన్న సంబంధం ఏంటి? అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. మీకే కాదు.. నెటిజన్లకు కూడా వచ్చింది. దీంతో తనే ఆ డౌట్ ను క్లారిఫై చేసింది.

ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను వ్యక్తిగతంగా ఆయనకు మద్దతు ఇస్తున్నా. ఆయన సోదరి డాక్టర్ మంజూల నాకు తెలుసు. నేను హైదరాబాద్ కు వచ్చినప్పటి నుంచి ఆమె నాకు పరిచయం. మంచి వ్యక్తి కాబట్టే మద్దతు ఇస్తున్నా.. అంటూ రిప్లయి ఇచ్చింది సమంత.

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా వీళ్లిద్దరికీ పరిచయం..

ప్రత్యూష ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా సమంత పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నది కదా. ఆ ఫౌండేషన్ లోనే డాక్టర్ మంజూల కూడా పని చేస్తోంది. అలా వాళ్లిద్దరికీ లింక్ కుదిరింది అన్నమాట. రేపల్లె నుంచి పోటీ చేస్తున్న సత్య ప్రసాద్ అనే వ్యక్తి మంజూల సోదరుడే. అది అసలు విషయం.

Read more RELATED
Recommended to you

Latest news