వచ్చేసింది.. మడతపెట్టే స్మార్ట్ ఫోన్!

-

ఇది స్మార్ట్ ఫోన్ల యుగం. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే. అంతేనా.. అంతకుమించి ఇంకేం లేదా.. అని అనుకుంటున్న తరుణంలో సామ్ సంగ్ దూసుకువచ్చింది. సరికొత్త స్మార్ట్ ఫోన్ తో మార్కెట్లోకి వచ్చింది. అదే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. మన భాషలో చెప్పాలంటే మడత పెట్టే స్మార్ట్ ఫోన్ లేదా మడిచే ఫోన్. పేరు ఏదైనా కానీ… దాన్ని మాత్రం పుస్తకంలా తెరుచుకోవచ్చు.. మడత పెట్టుకోవచ్చు. చూడటానికి ట్యాబ్ లా ఉంటుంది కానీ… మడతపెడితే చిన్న ఫోన్ లా కనిపిస్తుంది. ఈ మోడల్ ను సామ్ సంగ్ ముందుకు తీసుకొచ్చింది.

యూఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో ఈ మోడల్ ఫోన్ ను సామ్ సంగ్ విడుదల చేసింది. ఫోన్ ను మడవడం కోసం ఇన్ఫినిటీ ఫ్లెక్సీ డిస్ ప్లేను ఉపయోగించారు. సరికొత్త సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఈ మడిచే ఫోన్ ను తయారు చేసింది సామ్ సంగ్. డెవలపర్స్ కోసం నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ కు, మిగితా స్మార్ట్ ఫోన్లకు గల తేడాను వెల్లడించింది. ఆండ్రాయిడ్ కంపెనీ కూడా ఈ ఫోన్ కు ఓఎస్ అందించడానికి ఒప్పుకుంది. దీంతో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ నడవనుంది. ఫోన్ పూర్తి డిస్ ప్లే 7.3 ఇంచులుగా ఉంటుంది. అంటే.. అన్ని ఫోన్ల డిస్ ప్లే కన్నా పెద్దదన్నమాట. ఈ ఫోన్ లో మల్టీటాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒకేసారి మూడు యాప్స్ ను ఆపరేట్ చేయొచ్చు. ఇప్పటి వరకు గెలాక్సీ నోట్ 9 లో మాత్రం రెండు యాప్స్ ను ఒకేసారి ఆపరేట్ చేసుకునే వీలు ఉండేది. అయితే.. ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్ లోకి వచ్చేది మాత్రం ఇంకా కంపెనీ వెల్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version