ఎస్‌బీఐ ఆఫ‌ర్‌.. లోన్ తీసుకోండి.. 6 నెల‌ల త‌రువాత ఈఎంఐ చెల్లించండి..!

-

ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ శుభ‌వార్త చెప్పింది. కరోనా లాక్‌డౌన్ కార‌ణంగా చేతిలో డ‌బ్బులు లేక ఇబ్బందులు ప‌డుతున్న వారి కోసం ఎమ‌ర్జెన్సీ, ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్ లోన్లను అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ లోన్‌ను కేవ‌లం 45 నిమిషాల్లోనే తీసుకోవ‌చ్చు. గ‌రిష్టంగా రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ ఇస్తారు. ఇక ఈ లోన్‌కు గాను 6 నెల‌ల వ‌ర‌కు ఈఎంఐ చెల్లించాల్సి ప‌నిలేదు. ఆ త‌రువాత నుంచే ఈఎంఐ చెల్లింపులు ప్రారంభ‌మ‌వుతాయి.

sbi offers emergency loans for corona lock down victims

ఎస్‌బీఐ అందిస్తున్న ఎమ‌ర్జెన్సీ, ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్ లోన్ ద్వారా ప్ర‌స్తుతం రుణం తీసుకుంటే.. 6 నెల‌ల త‌రువాత.. అంటే.. అక్టోబ‌ర్ వ‌ర‌కు ఈఎంలు ప్రారంభం కావు. ఆ త‌రువాత నుంచి ఈఎంఐలు చెల్లించాలి. ఇక ఈ రుణానికి 7.25 శాతం వ‌డ్డీని వ‌సూలు చేయ‌నున్నారు. ఈ లోన్ పొందాలంటే ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సంప్ర‌దించాల్సిన ప‌నిలేదు. ఇంటి నుంచే ఎస్‌బీఐ సైట్ ద్వారా లోన్‌కు అప్లై చేయ‌వ‌చ్చు.

ఇక ఈ లోన్‌కు గాను ఎస్‌బీఐ యాప్‌, యోనో ఎస్‌బీఐ యాప్‌లోనూ అప్లై చేయ‌వ‌చ్చు. వివ‌రాల‌ను ఎంట‌ర్ చేశాక‌.. రుణం పొందేందుకు మీరు అర్హులైతే వెంట‌నే.. లోన్ అంద‌జేస్తారు. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఉద్యోగాలు పోయి, చేతిలో డ‌బ్బులు లేక ఇబ్బందులు ప‌డుతున్న వారి కోస‌మే ఈ రుణాల‌ను అందిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news