కరోనా కట్టడిలో హైదరాబాద్ భేష్…!

-

హైదరాబాద్ ని చూసి మరో ముంబై అవుతుంది అనుకున్నారు అందరూ… కాని హైదరాబాద్ లో కరోనా కట్టడి మీద ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణా సర్కార్… చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఉప్పల్ నుంచి లింగంపల్లి వరకు కట్టడి చేసేసింది. కేంద్రం కూడా ఈ చర్యలను చూసి షాక్ అయింది. హైదరాబాద్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలు మొన్నటి వరకు భారీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అవి తగ్గే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడైనా కరోనా పాజిటివ్‌ కేసు నమోదైతే ఆ ప్రాంతం మొత్తాన్ని ప్రభుత్వం కంటెయిన్‌మెంట్‌గా ప్రకటిస్తుంది. ఇక అక్కడ బారికేడ్లు వేసి ఆ వీధుల్లో ఉండేవారిని రెండువారాల పాటు బయటకు రాకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిత్యావసరాలు కావాలన్నా సరే అధికారులు స్వయంగా గేటు బయట ఉండి ప్రజలకు ఇచ్చే వారు.

జోన్‌ పేరుతో పెద్దసంఖ్యలో కుటుంబాలను నిర్బంధించడం ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని, ఇక హక్కులను కూడా హరించినట్టు అవుతుందని భావించిన సర్కార్ ఇప్పుడు జోన్స్ ని తగ్గించింది. వైరస్‌ సోకినవారిని, సంబంధీకులను హోం క్వారంటైన్‌ చేస్తే చాలు అనే భావనలో బల్దియా అధికారులు ఉన్నారు. కొత్త కేసులు నమోదు కాకపోతే జోన్ ని రద్దు చేస్తారు. ఆదివారానికి 40 మాత్రమే ఉన్నాయి. గతంలో వాటి సంఖ్య 190 వరకు ఉండేవి. 153 వరకు ఎత్తేసారు.

Read more RELATED
Recommended to you

Latest news