గూగుల్ లో మందు కోసం ఎలా వెతుకుతున్నారో చూడండి…!

-

మన దేశంలో లాక్ డౌన్ ని చాలా కఠినం గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఎవరూ బయటకు రాకుండా ఉండటానికి గానూ లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ సమయంలో జనాలు అందరూ ఒక చోట కు వచ్చే ఏ ఒక్క ప్రదేశానికి అనుమతి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపధ్యంలోనే మద్యం షాపులను కూడా పూర్తిగా మూసి వేస్తుంది కేంద్ర ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఇప్పుడు లాక్ డౌన్ అమలు చేసే సమయంలో మద్యం షాపులను తెరిచే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్తున్నాయి. దీనితో మందు బాబులకు పిచ్చి ఎక్కుతుంది. దీనితో గూగుల్ ఓపెన్ చేసిన జనం… మందు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ అమ్ముతున్నారు, ఏ వైన్ షాప్ దగ్గర ఉంది అనే దాని మీద ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. 2020, మార్చి 22 నుంచి మార్చి 28వ తేదీ వరకు, ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు మద్యం పైనే గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసారట.

మద్యం తయారీ అనే అంశాన్ని సెర్చ్ చేస్తున్న రాష్ట్రాలు మణిపూర్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అసోం, ఏపీ వరుస ఆరు స్థానాల్లో ఉండగా తెలంగాణ పదో స్థానంలో ఉందని తెలిసింది. బీర్ తయారు చేసే విధానం కోసం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వెతుకుతున్నాయి. ఢిల్లీ, కేరళ, హర్యాణ, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఏపీ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ మొదటి 10 స్థానాల్లో నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news