హోమో సెక్స్ గురించి సంచలన విషయాలు…!

-

స్వలింగ సంపర్కం అనేది పురాతన కాలంలో భారతదేశంలో ఆమోదయోగ్యమైనదే. స్వలింగ సంపర్కులు ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఇప్పటికీ తమ గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, ప్రాచీన భారతంలో దీనికి సామాజిక గుర్తింపు లభించింది. స్వలింగ సంపర్కం, తృతీయ లింగం అనేవి భారత సమాజంలో ఎప్పుడూ కలిసి ఉన్నాయని వాత్సాయనుడు ఆనాడే నిరూపించారు.

కామసూత్రలో వాత్సాయనుడు కొన్ని విషయాలను ఉదహరిస్తూ ఒకప్పుడు మహిళా స్వలింగ సంపర్కాన్ని స్వరాణీ’ అనేవారు. మహిళలు, మరో మహిళను పెళ్లి చేసుకుంటారు. వారిని సమాజం ‘థర్డ్ జెండర్’గా సులభంగా అంగీకరించింది అని వివరించారు. అదే పుస్తకంలో పురుష స్వలింగ సంపర్కులకు ‘క్లీవ్’ అనేవారని ఆయన తెలిపారు. “వారిని నపుంసక పురుషులు అనేవారు.

వారు తమ స్వలింగ సంపర్క ధోరణి కారణంగా మహిళలపై ఆసక్తి చూపించేవారు” అని తెలిపారు. ఈ విషయాలు అన్ని ముందు కాలంలో సెక్స్ గురించి ప్రజలు ఎంత బాహాటంగా ఆలోచించేవారు అనేది తెలియజేస్తాయి. ఒడిశా కోణార్క్ సూర్యమందిరం విషయానికే వస్తే, అక్కడి శిల్పకళలో నగ్న శిల్పాలు, అలాగే అజంతా, ఎల్లోరా గుహల్లో కూడా యువతుల నగ్న వర్ణనలు కనిపిస్తాయి.

అజంతా గుహలో చిత్రాలను క్రీస్తుకు రెండు శతాబ్దాల ముందు వేశారు. అటు ఎల్లోరాలోని శిల్పాలను ఐదు నుంచి పదో శతాబ్దం మధ్యలో చెక్కినట్లు చెబుతున్నారు. భారతదేశంలో సెక్స్ గురించి బహిరంగంగా ఉన్న వర్ణనను మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయాల్లో మనకు కనిపిస్తాయి. గోడలపై సెక్స్‌లో ప్రతి భంగిమను వర్ణించారు. ముగ్గురితో లైంగిక సంబంధాలు నెరపడం గురించి కూడా ఇక్కడ మనకు శిల్పాలు కనిపిస్తాయి.

ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే ప్రాచీన కాలం లో ఆమోదయోగ్యమైన స్వలింగ సంపర్కం నేడు భారతదేశంలో చట్టప్రకారం నేరం. అయితే భారతదేశంలో ప్రాచీన ఆలయాల్లో శిల్పకళ ద్వారా స్వలింగ సంపర్కం అనేదానిని సామాన్యులకు వివరంగా అర్థమయ్యేలా తెలియజేశారు. కానీ కాలక్రమేణా అందరి ఆలోచనల్లో మార్పు రావడం వల్లనో లేదంటే ఇంకొందరి తప్పుడు ప్రచారం వలనో ఇది ఇప్పుడు నేరం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news