ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం సిఎం ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం కేబినేట్ సమావేశం ముగిసిన వెంటనే జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రధాని నరేంద్ర మోడితో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు, మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
అదే విధంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని జగన్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడంపై కూడా ఆయన ప్రధానితో చర్చించే అవకాశం ఉందని, ఆర్ధిక లోటు సహా అనేక అంశాలను జగన్ ప్రధానితో చర్చిస్తారని అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిధులపై కూడా చర్చ జరుగుతుందని అంటున్నారు.
ఇక విభజన హామీలను కూడా నేరవేర్చమని కోరే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా విశాఖ రైల్వే జోన్ సహా ప్రత్యేక హోదా విషయం కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసే అవకాశం ఉందని అంటున్నారు. వాళ్ళతో భేటీ అనంతర౦ హోం మంత్రి అమిత్ షాని కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఆయన మూడు రాజధానుల విషయమై మోడీతో ఏ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరడానికి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.