కారులో సెక్స్‌.. సీన్‌ కట్‌ చేస్తే రూ. 40కోట్లు పరిహారం ఇవ్వాలిందిగా కోర్టు ఆదేశం..!

-

ప్రేమ పుట్టడానికి సమయం, వయసుతో సంబంధం లేదంటారు.. కానీ సెక్స్ చేయడానికి మాత్రం సమయం, సందర్భం కావాలి..ప్రియుడు పక్కనే ఉన్నాడు కదా అని ఎక్కడపడితే అక్కడ చేయలేం కదా..! అయితే లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు ఈ మధ్య చాలామంది కపుల్స్‌ కారులోనే కానిచ్చేస్తున్నారు. పెట్రోలింగ్‌ పోలీసులు చూస్తేనే ఇబ్బంది అవుతుందనుకోండి..! అయితే ఓ అమ్మాయి కారులో తన ప్రియుడితో సెక్స్‌ చేసింది..కానీ ఆమె తనకు కారులో సెక్స్‌ చేయడం వల్ల సెక్సువల్‌ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ (STD)రావడానికి.. ఆ కారే కారణమని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. ఆ కారు బీమా సంస్థపై రూ. 40 కోట్లు దావా వేసింది. వినడానికే వింతంగా ఉంది కదూ.. ఆమె అసలు ఇలా కోర్టును ఆశ్రయించడమే క్రేజీ అంటే. కోర్టు ఆమె వాదను సమర్థిస్తూ.. అంత డబ్బు కట్టమని బీమా సంస్థను ఆదేశించడం ఇంకా హైలెట్‌ ఆఫ్‌దీ స్టోరీ.! ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..!
అమెరికాలోని మిస్సౌరీలో నివసిస్తున్న ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కారులో సెక్స్ చేసింది. ఆ తర్వాత ఆమె లైంగిక వ్యాధి సంక్రమించింది. ఇందుకు ఆ కారు బీమా సంస్థే బాధ్యత వహించాలంటూ ఆమె ఇన్సురెన్స్ సంస్థ GEICOపై 5.2 మిలియన్లు (రూ.40 కోట్లు) దావా వేసింది. ఇటీవల ఈ కేసును విచారించిన జాక్సన్ కౌంటీ కోర్టు ఆమె వానదను సమర్థించింది.

యువతి వాదనను సమర్థించిన కోర్టు..

ఈ క్లెయిమ్ పాలసీ పరిధిలోకి రాదని ఆ బీమా సంస్థ వాదించింది. వారు కారులో సెక్స్ చేసుకుంటే బీమా సంస్థ ఎందుకు బాధ్యత వహించాలని ఆ సంస్థ న్యాయవాదుల వాదించారు. అయితే, ఆమె తరఫు న్యాయవాదులు మాత్రం బీమా సంస్థకు వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించారు. ఆ కారుకు బీమా కడుతున్న కస్టమర్(ఆమె ప్రియుడు) తనకు STD ఉందనే విషయాన్ని చెప్పకుండా ఆమెతో కారులో సెక్సులో పాల్గొన్నాడని తెలిపారు. కారులో కలిసినప్పుడే ఆమెకు ఆ నష్టం జరిగింది కాబట్టి. ప్రతిఫలంగా ఆ కారు సంస్థ ఆమె వైద్య ఖర్చులకు, జరిగిన నష్టానికి బాధ్యత వహించాలని ఆమె న్యాయవాదులు పేర్కొన్నారు.

కోర్టు ఉద్దేశం అదేనట..

ఈ నేపథ్యంలో కోర్టు బాధితురాలికి సానుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాన్ని GEICO సంస్థ ఫెడరల్ కోర్టులో సవాల్ చేసింది. అయితే, అక్కడ కూడా బీమా సంస్థకు చుక్కెదురైంది. ఆమె ఫిబ్రవరి, 2021లో నమోదు చేసింది. 2017 సంవత్సరంలో కారులో జరిగిన సెక్స్ వల్ల బాధితురాలికి హ్యూమన్ పాపిల్లోమా వైరస్‌(HPV)ని సంక్రమించిందని, అసురక్షిత సెక్స్‌కు ఆ కారే డైరెక్టుగా లేదా ఇన్‌డైరెక్టుగా కారణమైంది కాబట్టి, బీమా సంస్థ పరిహారం చెల్లించాల్సిదేనని యువతి పేర్కొంది. అతడికి హెచ్‌పీవీ ఉందని తెలిసి కూడా అతడు ఆమెతో సెక్సులో పాల్గొన్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ కారు కస్టమర్ చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ.. ఆ బీమా పాలసి ద్వారా ఆమెకు పరిహారం చెల్లించాలనేది కోర్టు ఉద్దేశం. మరి, ఆ బీమా సంస్థ ఏం చేస్తుందో చూడాలి.
అసలు ఇదెక్కడి తీర్పురా అని విషయం తెలిసిన నెటిజన్లు అంటున్నారు. కష్టమర్‌ తప్పు చేస్తే.. బీమా సంస్థ మెడకు చుట్టుకోవడం ఏంటో.. ఇంతకీ ఈ తీర్పుపై మీరేమంటారు..?

Read more RELATED
Recommended to you

Latest news