అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. సోమవారం భారత పర్యటనకు వచ్చిన ఆయన… ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియం లో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా ఆయన, ఆగ్రా లోని తాజ్ మహాల్ కి వెళ్ళారు. అక్కడ తాజ్ మహాల్ అందాలను భార్య మెలానియా ట్రంప్ తో కలిసి ఆయన వీక్షించారు.
అయితే ఆయనకు తాజ్ మహాల్ అనే పేరు కలిసి రాలేదు. 1990లో న్యూజెర్సీలోని అట్లంటిక్ సిటీలో తాజ్ మాహల్ పేరుతో క్యాసినోను ట్రంప్ ప్రారంభించారు. దాన్ని ప్రారంభించిన కొన్ని నెలలకే సంస్థ దివాలాకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో దాన్ని ఎంటర్టైన్మెంట్ రిసార్ట్స్ అనే మాతృ సంస్థ కిందకు తీసుకువచ్చారు. అప్పటికే అది రెండు సార్లు దివాలా తీసి కష్టాలు మిగిల్చింది.
తాజ్ మహల్‌ను 2017లో హార్డ్ రాక్ కేఫ్ బ్రాండ్‌కు అమ్మేశారు. కాగా ఆయన ప్రస్తుతం హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటి అవుతున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఇందులో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగే అవకాశం ఉంది. అలాగే కీలక రక్షణ ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. అధునాతనమైన ఆయుధ సంపత్తిని భారత్ కి అందిస్తుంది అమెరికా.