షాకింగ్; ఉరి మళ్ళీ వాయిదా…!

-

నిర్భయ అత్యాచార దోషులకు ఉరి మళ్ళీ వాయిదా పడినట్టే కనపడుతుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఉరి ఇప్పుడు మరోసారి వాయిదా పడనుంది. నిందితులను వేరు వేరు గా ఉరి తీయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్ట్ దాన్ని మార్చ్ 5 కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో నలుగురు దోషుల ఉరి మళ్ళీ వాయిదా పడుతుంది.

ఇటీవల పాటియాలా హౌస్ కోర్ట్ నిందితులకు డెత్ వారెంట్ జారి చేసింది. మార్చ్ 3 న వాళ్ళు చనిపోయే వరకు ఉరి తీయాలని తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది కోర్ట్. దీనితో ఉరికి అధికారులు సన్నద్దమయ్యారు. ఇప్పటికే తలారిని కూడా అధికారులు సిద్దం చేసారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కి చెందిన పవన్ జలాద్ అనే తలారిని తీసుకొచ్చి అతనికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసారు జైలు అధికారులు.

ఇప్పుడు కేంద్ర౦ వేసిన పిటీషన్ కి సంబంధించి విచారణను మార్చ్ 5 కి వాయిదా వేయడంతో వాళ్ళను ఉరి తీయడ౦ ఇక ఇప్పుడు మళ్ళీ అనుమానం గానే మారింది. ఎప్పుడో 2012 లో వారికి ఉరి శిక్ష విధించి౦ది కోర్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉరి వాయిదా పడుతూనే వస్తుంది. వారిని ఫిబ్రవరి 1 న ఉరి తీయాల్సి ఉండగా కోర్ట్ స్టే విధించింది. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news