కొంతమంది విద్యార్థులు చదివింది మర్చిపోతుంటారు. పరీక్షల్లో మొత్తం మర్చిపోతారు. అలా కాకుండా చదివింది పిల్లలకు గుర్తు ఉండాలంటే ఇలా చేయాలి. మెదడు చురుకుగా పని చేయడానికి మంచి లైఫ్ స్టైల్ ని ఫాలో అవ్వాలి. రాత్రి పది గంటల లోపు నిద్రపోవాలి. ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి. నాణ్యమైన నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర ఉండాలని గుర్తుపెట్టుకోండి. అలాగే చురుకుగా వినడం మొదలు పెట్టాలి. కేవలం కంటితో చూస్తూ చదవడం కాకుండా చురుకుగా వినడం కూడా అలవాటు చేసుకోవాలి.
దేనినైనా చదివినా విన్నా కూడా గ్రహించాలి. జ్ఞాపకశక్తిని పెంచుకోవడంలో విజువలైజేషన్ టెక్నిక్ చాలా ముఖ్యం. చదివిన లేదంటే చూసిన వాటిలో ఏదైనా అంశాన్ని మీరు ఈజీగా తలకు ఎక్కించుకోవాలి. అలా చేయడం వలన గుర్తుంటుంది. ఒకసారి చదివిన వాటిని మళ్లీ రీకాల్ చేసుకోవడం కూడా ముఖ్యం.
చదివిన వాటిని ఎప్పటికప్పుడు రీకాల్ చేసుకున్నట్లయితే అన్నిటినీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకేసారి అంతా కాకుండా సమాచారాన్ని అంశాల వారీగా చిన్న చిన్న భాగాలు చేసుకోండి. అలా చేయడం వలన త్వరగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మంచి డైట్ ని ఫాలో అవ్వండి. రోజు వ్యాయామం చేయాలి. ఇలా వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే బాగా చదివినవి గుర్తుంటాయి. మంచి మార్కులు వస్తాయి.