చంద్రగ్రహణం తర్వాత నుంచి ఆ ఇంట్లో రోజూ మంటలు.. కారణం తెలియక కుటుంబసభ్యుల ఆందోళన..

-

సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేవి కామన్‌గా జరిగేవి కావు.. వీటి వెనుక సైన్స్‌కు చిక్కని రహస్యాలు ఉన్నాయి..ఆచారాలు ఉన్నాయి.. గ్రహణం రోజు పెద్దోళ్లు చాన్తాడంతా లిస్ట్‌ చెప్తారు. అయితే ఉత్తరాఖండ్‌ నైనిటాల్ జిల్లా హల్ద్వానీలోని ఓ ఇంట్లో జరిగిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఆ ఇంట్లో 8 రోజులుగా రోజూ రాత్రి వేళ మంటలు అంటుకుంటున్నాయి. చంద్రగ్రహణం తర్వాత నుంచి ఇలా జరుగుతోందనీ, తమకు చాలా భయం వేస్తోందని కుటుంబ సభ్యులు అంటున్నారు. నవంబర్ 8న చంద్రగ్రహణం వచ్చింది. అలాగే నవంబర్ 9న నేపాల్‌లో భూకంపం వచ్చింది. దాని ప్రభావం ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలపై పడింది. వాటిలో ఉత్తరాఖండ్ కూడా ఉంది. ఈ రెండు ఘటనల తర్వాత రాత్రివేళ మంటలు అంటుకుంటున్నాయనీ.. తాము సరిగా నిద్రపోలేకపోతున్నామని వారు భయపడుతున్నారు.
ఈ ఘటన తర్వాత కరెంటు డిపార్ట్‌మెంట్ అధికారులకు విషయం చెప్పగా వారు వచ్చి.. ఇంటికి కరెంటు సప్లై నిలిపేశారు. అయినప్పటికీ ఎలక్ట్రిక్‌ బోర్డులు, వైర్లూ కాలిపోతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 8 రోజుల్లో 20 సార్లు మంటలు వచ్చాయట. వాటి వల్ల పరుపులు, అల్మారాలో ఉంచిన బట్టలు కూడా కాలిపోయాయట పాపం..

ఎందుకు ఇలా జరుగుతుంది..

కరెంటు సరఫరా లేకపోయినా ఆ ఇంట్లో తరచూ కూలర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యి మంటలు వస్తున్నాయి. విద్యుత్‌ అధికారులు ఇంట్లో ఎర్తింగ్‌ ఏర్పాటు చేశారు. దీనివల్ల కరెంట్‌ షాక్‌ కొట్టకుండా ఉంటుందట. ప్రస్తుతం ఆ ఇంట్లో ఇంకా.. మంటలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు అన్నది ఎవరికీ తెలియట్లేదు. స్థానికులేమో చంద్రగ్రహణం సమయంలో ఏదో తేడా వచ్చిందని భయపడుతున్నారు.. మరికొందరు భూకంపం వల్ల తేడా వచ్చి ఉంటుందని అంటున్నారు. కారణం ఏదైనా ఇలా మంటలు రావడం అనేది అంతుచిక్కని మిస్టరీగా మారింది.
ఈ మంటలు ఇలాగే కొనసాగితే.. దీనిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయి. భూమి లోపల మండే స్వభావం ఉన్న వాయువులు లీకవ్వడం వల్ల ఇలా జరుగుతూ ఉండొచ్చనే అభిప్రాయం కూడా ఉంది. భూకంపం వల్ల ఆ వాయువులు లీకవుతూ ఉండొచ్చనే అనుమానం కూడా ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news