75వ స్వాతంత్ర్య దినోత్సవం.. స్వాతంత్ర్య సమరయోధులు ఇచ్చిన నినాదాలు..

-

200ఏళ్ళు బ్రిటీషు చేతిలో ఉన్న భారతావనిని విడిపించి, మా దేశాన్ని మేమే పాలించుకుంటాం అని చాటిచెప్పి స్వాతంత్ర్య సమరంలో అమరులైన సమరయోధులను గుర్తు చేసుకుంటూ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ 75వ స్వాంతంత్ర్య దినోత్సవం రోజున సమరయోధుల జీవిత గాధల గురించి తెలుసుకోవాలి. స్వాంతంత్ర్య సంగ్రామ స్ఫూర్తిని ప్రజల్లో కలిగించడానికి వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలి. చివరగా, రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి పడమరి దారిని చూపిన ధీరోధాత్తులను నివాళులు అర్పించాలి. ఈ జాతీయ పండగ రోజున, పర్వదినాన సమరయోధులు చేసిన నినాదాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

స్వరాజ్యం నా జన్మ హక్కు. దాన్ని సాధించి తీరతాను.

దేవుడు అంటరానితనాన్ని సృష్టిస్తే, నేను ఆ దేవుడిని దేవుడిగా అంగీకరించను.
– బాలగంగాధర తిలక్.

నాకు రక్తాన్ని ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను – సుభాష్ చంద్రబోస్.

మేల్కొండి, చదువుకోండి, సమాజం కట్టుబాట్లను దాటి స్వేఛ్ఛను సాధించండి. -సావిత్రిబాయి పూలే.

బెంగాల్ విభజన దినం. బ్రిటీషు సామ్రాజ్య పతన దినం- మహాత్మగాంధీ.

ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి) – భగత్ సింగ్.

ప్రతి కంటి నుండి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం- జవహర్ లాల్ నెహ్రు.

భారతదేశానికి హుందువులు, ముస్లింలు రెండు కళ్ళలాంటి వారు- సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్.

ఆలోచనల్లో నిజాయితీ, మాటల్లో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉన్నవారే మనకు అవసరం- సరోజినీ నాయుడు.

నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి- సర్దార్ వల్లభాయ్ పటేల్.

బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి. బ్రిటీష్ ప్రజలతో మాకు వైరం లేదు- మౌలానా అబుల్ కలాం ఆజాద్.

సూర్యుడు కనబడలేదని కన్నీరు పెడితే, చివరకు నక్షత్రాలు కూడా కనబడకుండా పోతాయి- రవీంద్రనాథ్ ఠాగూర్.

స్వాతంత్ర్యం అనేది ఓ కనిపించని మహా అదృష్టం. అది లేనప్పుడు గానీ దాని విలువ తెలియదు- రవీంద్ర నాథ్ ఠాగూర్.

Read more RELATED
Recommended to you

Latest news