సరదా కోసం అమ్మాయిలు శృంగారానికి ఒప్పుకోరు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

ఇండియా సంప్రదాయకమైన దేశమని.. పెళ్లికానీ యువతులు సరదా కోసం అబ్బాయిలతో శృంగారం చేయటం లేదని మధ్య ప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యనించింది. అబ్బాయిల తో పెళ్లి జరుగుతుందనే నమ్మకం ఉంటేనే వారు శృంగారానికి అంగీకరిస్తున్నారని స్పష్టం చేసింది. అయితే… ఈ వ్యాఖ్యలు ఓ అత్యాచార కేసు సందర్భంగా మధ్య ప్రదేశ్‌ హైకోర్టు పేర్కొంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే… పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు వాడుకున్నాడని ఓ యువకుడిపై బాధితురాలు రేప్‌ కేసు పెట్టింది.

అయితే.. పరస్పర అంగీకారంతో వారు దగ్గరయ్యారని ముద్దాయి తరఫు న్యాయవాదాఉలు వాదించారు. అంతేకాదు.. బాధితురాలు అప్పటికి మేజర్‌ అని కూడా కోర్టు చెప్పారు. కులాలు వేరు కావడంతో బాధితురాలి ఇంట్లో పెళ్లి కి అంగీకరించడం లేదని తెరపైకి తెచ్చారు. అయితే.. పెళ్లి పేరుతో బాధితురాలిని 2018 నుంచీ నిందితుడు బలవంతం చేస్తూ.. వచ్చాడని ప్రాసిక్యూషన్‌ పేర్కొంది. ఆ తర్వాత .. తనకు ఇంతకు మనుపే పెళ్లి జరిగిందని ప్లేటు ఫిరాయించినట్లు వివరించింది. అయితే.. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. నిందితుడికి బెయిల్‌ నిరాకరించింఇ. యువకుడితో జీవితాన్ని పంచుకునేందుకు బాధితురాలు కట్టుబడి ఉందని.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆమె ఓ మారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపింది కోర్టు. అమ్మాయిలు సరదాకు అబ్బాయిలతో శృంగారానికి ఒప్పుకోరన్న కోర్టు… అబ్బాయికి బెయిల్‌ క్యాన్సల్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news