అత్యంత వేగమైన పరుగెత్తే వ్యక్తి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఉసేన్ బోల్ట్. తన అత్యంత వేగవంతమైన పరుగు ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు జమైకాకు చెందిన స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్. వంద మీటర్ల దూరంను 9.58 సెకన్లలో చేరుకుని ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. అత్యంత అరుదైన ఈ రికార్డ్ ను రాత్రికి రాత్రే బ్రేక్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు శ్రీనివాస్. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో ప్రతిసారి “కంబళ” అనే పేరుతో ఎద్దులతో పరుగు పందెం నిర్వహిస్తారు.
అలా నిర్వహించిన పోటీల్లో శ్రీనివాస గౌడ తన ఎద్దులతో కలిసి కేవలం13.62 సెకన్ల కాలంలో 142.50మీటర్లు దూరాన్ని పరిగెత్తి ఘనవిజయం సాధించాడు. అయితే వేగం పరంగా లెక్కిస్తే 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తినట్లు గుర్తించారు. అయితే రికార్డుల పరంగా చూస్తే ఇది అఫీషియల్ కాకపోయినా బోల్ట్ సాధించిన రికార్డుకంటే 0.03 సెకన్ల తక్కువ సమయంలోనే పూర్తి చేశాడు.
అంతే కాకుండా అది కూడా నేల మీద కాకుండా తనదైన శైలిలో బురదలో పరుగు పెట్టీ, అదేంటంటే ఒక చేత్తో బర్రెలను పట్టుకుని మరి బురదలో అత్యంత వేగంగా పరుగెత్తి రికార్డ్ సృష్టించాడు. ఈ విషయం కాస్త లోకల్ మీడియాతో పాటు, పలు మీడియాల్లో కూడా రావడంతో విషయం కాస్త వైరల్‌గా మారింది. దీంతో శ్రీనివాస్ రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. అయితే ఈ పందెంలో శ్రీనివాస్ గౌడ పరుగు వేగాన్ని చూసిన వాళ్లు అతనికి అభిమానులుగా మారిపోయారు.