కంబాల రేసర్ దశ తిరిగిపోయిందిగా…!

-

కన్నడ సాంప్రదాయ క్రీడా కంబాలాలో జరిగిన పోటీలో చరిత్ర సృష్టించిన కర్నాటకకు చెందిన శ్రీనివాస గౌడ దశ తిరిగిపోయింది. శ్రీనివాస్ గౌడకు యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు హామీ ఇచ్చిన కొన్ని గంటల తరువాత, బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో అతని శిక్షణ మరియు అతన్ని అంచనా వేయడానికి గాను అధికారులు ఏర్పాట్లు చేసారు.

శ్రీనివాస్ గౌడకు రైలు టిక్కెట్లను బుక్ చేసినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్విట్టర్‌లోకి ప్రకటించింది. అతనిని సోమవారం బెంగళూరులోని ఎస్‌ఐఐ కోచ్‌లు అంచనా వేయనున్నారు. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ గౌడ అనే 28 ఏళ్ల కంబాలా రేసర్ ఈ నెల మొదట్లో రికార్డు సృష్టించగా ఆ రేసు క్లిప్‌లు వైరల్ కావడంతో ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. “మేము శ్రీనివాస గౌడ వద్దకు చేరుకున్నాము మరియు అతని రైలు టికెట్ బుక్ చేసాము.

అతను సోమవారం SAI యొక్క బెంగళూరు కేంద్రంలో ఉంటాడు, అక్కడ మా కోచ్లు అతనిని అంచనా వేస్తారు. తాము ప్రతిభను గుర్తిస్తామని డిజి SAI ట్వీట్ చేసారు. నిర్మాణ కార్మికుడిగా ఉద్యోగం తీసుకునే శ్రీనివాస్, కర్ణాటకకు చెందిన సాంప్రదాయ క్రీడ అయిన వేగవంతమైన కంబాలా రేసు రికార్డును బద్దలు కొట్టాడు, ఇక్కడ రైతులు ఒక జత గేదెలతో ఈ పరుగుని ప్రారంభిస్తాడు. శ్రీనివాస్ 142 మీ రేసును కేవలం 13.42 సెకన్లలో పూర్తి చేసాడు. ఉసేన్ బోల్ట్ ని అధిగమించాడు. అతను కనుక నిరూపించుకుంటే మాత్రం దశ తిరిగిపోయినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news