సన్‌స్క్రీన్ లోషన్‌ 40 ఏళ్లపాటు వాడంది.. ఇప్పుడేంటి ఇలా అయింది..?

-

అందంగా కనిపించాలని ప్రతి మహిళ అనుకుంటుంది. అదేంటో ఆడపిల్లలకు పుట్టుకతోనే ఈ కోరిక ఉంటుంది. బయటకు వెళ్తే ఎండ తగలకుండా నానా తంటాలు పడతారు. స్కార్ఫ్‌లని, గ్లౌజ్‌లనీ, సన్‌ స్క్రీన్‌ లోషన్‌ అని అబ్బో ఏవేవో రాస్తారు. ఈ వార్త మహిళలను కాస్త ఆందోళనకు గురిచేస్తుంది. అమెరికాలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక 92 ఏళ్ల వృద్ధురాలు దాదాపు 40 ఏళ్లపాటు ముఖానికి యూవీ కిరణాల నుంచి కాపాడుకోవడానికి అనేక రకాల సన్ స్క్రీన్ లోషన్‌లను ఉపయోగించింది. అయితే.. తాజాగా, ఆమె ముఖం కొంత కిరణాల ప్రభావానికి గురికాకున్న , ప్రస్తుతం ఆమె మెడ యూవీ కిరణాల ప్రభావానికి గురైంది. ఓల్డ్ ఏజ్‌లో ఆమె మెడపై అనేక రకాల మచ్చలు ఏర్పడ్డాయి.

ఆమె ముఖం కన్నా కూడా మెడ భాగం పూర్తిగా మారిపోయింది. అనేక రకాల మచ్చలతో చూడగానే భయంకరంగా తయారైంది. మెడ యూవీ కిరణాల ప్రభావానికి గురైంది. ప్రస్తుతం ఈ మహిళ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ముఖానికి అనేక రకాల లోషన్‌లు పెట్టుకున్న, మెడకు మాత్రం.. దాని ప్రభావానికి గురైందని వైద్యులు ట్వీట్ చేశారు.

చాలామంది అమ్మాయిల అవసరం లేకున్నా ఏవేవో క్రీమ్స్‌ ఫేస్‌కు రాసేస్తారు. ముఖంపై మచ్చలు లేకుండా, జిడ్డుగా లేకుండా ఉంటే చాలు..కలర్‌ రావాలని ఏవేవో రసాయనాలతో కూడిన క్రీమ్స్‌ రాయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. మంచిగా ఫ్రూట్స్‌ తింటే అసలు స్కిన్‌కు ఇంకేం పెట్టక్కర్లేదు.మీరు రోడ్డుమీద ఉన్న జంక్‌ఫుడ్‌ అంతా తిని.. ముఖానికి అంతంత ఖరీదు పెట్టి క్రీమ్స్‌ రాయడం వల్ల మీ చర్మం అన్‌నాచురల్గా ఉంటుంది తప్ప ఆ గ్లో ఉండదు. రెండు రోజులు క్రీమ్స్‌ రాయడం ఆపేస్తే మళ్లీ సీన్‌ రిపీటే. కాబట్టి..సౌందర్య నిపుణులు ఏం చెప్తున్నారంటే..అందంగా ఉండాలంటే..క్రీమ్స్‌కు పెట్టే డబ్బులు తినే ఆహారంపై పెట్టండి. ఫ్రూట్స్‌ బాగా తినండి. ముఖ్యంగా విటమిన్‌ సీ ఉన్న ఫ్రూట్స్‌కు ఆరోగ్యానికి చాలా మంచివి. స్కిన్‌కు ఇంకా మేలు చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news