మీ క‌ళ్ల ప‌వ‌ర్ కు టెస్టు.. ఈ చిత్రంలో ఉన్న పామును గుర్తుప‌ట్టండి..?

సోషల్ మీడియాలో మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించిన అనేక వింతలు, విశేషాలు కనిపిస్తుంటాయి. వాటిని చూస్తే మ‌న కండ్ల‌ను మ‌నం కూడా న‌మ్మ‌లేని విధంగా ఉంటాయి. అందులో క‌నిపించే అనేక ఫొటోలు, వీడియోలు మ‌న కండ్ల‌కు, మైండ్‌కు ప‌నిపెడుతాయ‌ని చెప్ప‌డంతో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు కూడా అలాంటి దాని గురించే మ‌నం మాట్లాడుకోబోయేది. అది ఒక ప‌జిల్‌కు సంబంధించింది. అదేంటే ఇప్ప‌డు తెలుసుకుందాం.

ఇక ప‌జిల్ అంటేనే సోస‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ఫొటోలు, వీడియోల రూపంలో ఉంటుంది. దాన్ని క‌నిపెట్టాలంటే ఎంతో ట్యాలెంట్ ఉండాల్సిందే. చూడ‌టానికి మ‌న‌కు సింపుల్‌గా అనిపించినా కూడా దాన్ని క‌నిపెట్టాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా ఓ ఫొటో ప‌జిల్‌లో ఆడేందుకు వేలాది మంది ట్రై చేస్తున్నారు.

ఈ ఫొటోను ఓ ఫారెస్టులో తీశారు. కాగా ఆ ఫొటోలో ఒక పాము దాగి ఉంటుంది. దీన్ని ది స్నేక్ స‌న్‌షైన్ క్యాచ‌ర్స్ గ్రూప్ లో ఫేస్‌బుక్‌లో పోస్ట‌8ఉ చేయ‌గా వేలాది మంది దాన్ని క‌నిపెట్టేందుకు ట్రై చేసినా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే అందులోని పాము అచ్చం అడ‌విలో క‌ల‌సిపోయేలాగా ఉంది. ఎంతో మంది ట్రై చేసి చాలా చోట్ల మార్కులు పెట్టినా కూడా సరిగ్గా చెప్ప‌లేక‌పోయారు. మ‌రి మీ కండ్ల‌కు టెస్టు పెట్టి ఒక‌సారి ఆడండి. పామును క‌నిపెట్టండి.