తెలంగాణలో ఇప్పుడు రాష్ట్రా రాజకీయాలు మొత్తం హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. అలాంటి ఎన్నికలను ఏ పార్టీ అయినా చాలా సీరియస్గా తీసుకుంటుంది. మరి కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల మాత్రం ఆ ఎన్నికలపై ఎందుకు ఫోకస్ పెట్టట్లేదనే వాటిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద సంచలనం రేపుతున్నాయి. ఎందుకంటే ఏ మాత్రం ఛాన్ష్ దొరికినా
తెలంగాణలోని అన్ని పార్టీలపై విరుచుకు పడే ఆమె ఎన్నికలంటే మాత్రం ఆమడ దూరం ఉండటం ఏంటో తెలియట్లేదు.
వీలు కుదిరితే కేసీఆర్పై సంచలన ఆరోపనలు చేస్తూ వార్తల్లో ఉంటున్న వైఎస్ షర్మిల ఎన్నికల్లో పోటీ అంటే మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు. ఆమె పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో వస్తున్న తొలి ఉప ఎన్నికను ఎంతో సవాల్ గా తీసుకోవాలని గానీ ఇలా చేయడమేంటని ఆమె అభిమానులు అభ్యంతరం తెలుపుతున్నారు.
ఆమె పోటీ చేయకుండానే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా ఈ ఉపెన్నికపై షర్మిల స్పందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వల్ల తెలంగాణలో ఉంటున్న ఎవరికైనా లాభం ఉంటుందా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందుకే తాము పోటీచేయమంటూ సమర్థించుకుంటున్నారు. పోటీ చేయమంటే ఏవేవో కారణాలు చెబుతూ తప్పించకుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.