ఫుల్‌గా తాగేసిన వరుడు.. పెళ్లి పీఠల మీద గురకబెట్టి నిద్ర..వధువు ఏం చేసిందంటే..

-

ఎంత తాగుబోతు అయినా.. తన పెళ్లి రోజు మాత్రం ఫుల్‌గా తాగడు కదా.. కానీ ఇతను మాత్రం తన పెళ్లి రోజే ఫుల్‌గా తాగేసి..పీటల మీద నిద్రపోయాడు.. అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదా..! సాధారణంగా పెళ్లిళ్లో.. పెళ్లి కొడుకు ఎంట్రీ అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. కారు దిగడంతోనే..వీడియోలు, ఫోటోలతో రెడీగా ఉంటారు. కానీ మనోడు మాత్రం కారు దిగి..  ఉన్నాడుతూలుతూ.. హైలెట్‌ ఏంటంటే.. పెళ్లి కొడుకు తండ్రి కూడా అంతే తూలుతున్నాడు. ఎలాగోల పెళ్లికొడుకును మండపంలోని పెళ్లి పీటల వరకు తీసుకొచ్చారు..అయినా మనోడికి మత్తు వదల్లేదు.. పెళ్లి తనదే అన్న విషయం మరిచిపోయాడు. పెళ్లీ పీటలపైనే గురకపెట్టి నిద్రపోయాడు. ఈ ఘటన అసోంలోని నల్బరీ జిల్లాలో జరిగింది.

- Advertisement -

అసోంలోని నల్బరీ జిల్లాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తాగిన మత్తులో తన పెళ్లి అన్న విషయమే మర్చిపోయిన వరుడుపై పెళ్లి కూతురికి మండిపోయింది. పీకల వరకు తాగిన పెళ్లికొడుకుపై పీకల వరకు కోపం కట్టలు తెంచుకుంది. మత్తు దిగిన తర్వాత పెళ్లి చేద్దాం అని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించినా.. పెళ్లి కుమార్తె మాత్రం ససేమిరా అనింది.. పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పింది. అయితే ఆమెకు ఇరు కుటుంబాల వాళ్లు నచ్చజెప్పారు.. కష్టపడి ఆమెను పెళ్లీకొడుకు పక్కన కూర్చోపెట్టారు.. పెళ్లి కొడుకును కూడా అతి కష్టంమీద లేపి పీటల మీద కూర్చోబెట్టారు.

ఎంత తాగాడో..ఏం తాగాడో కానీ.. పెళ్లికొడుకుకు అస్సలు సోయ లేదు. రెండోసారి లేపిన తర్వాత అతి కష్టం మీద లేచిన పెళ్లి కొడుకు.. పెళ్లీ పీటలపై అమ్మాయి పక్కన ఉండగానే మళ్లి నిద్రలోకి జారుకున్నాడు. పూజారి మంత్రాలు చెబుతున్న సమయంలో గురకపెట్టి నిద్రపోయాడు. దీంతో వధువుకు చిరెత్తుకొచ్చి అక్కడి నుంచి లేచి వెళ్లి పోయింది. అతడిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. మళ్లీ బతిమిలాడితో మర్యాదగా ఉండదు అనింది..అతని బాధ్యత ఏంటో అందరూ చూశారని.. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోను అని వధువు చెప్పింది..

పెళ్లి కొడుకు తీరుపై వధువు బంధువులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. పెళ్లికి అయిన ఖర్చులను పెళ్లి కుమారుడి నుంచి ఇప్పించాలని పంచాయితీ పెట్టారు. తర్వాత పెళ్లికి పరిహారం చెల్లించాలని నల్బరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనలో మరో షాకింగ్ ట్విస్ట్‌ ఉంది. కేవలం పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు తండ్రే కాదు.. మండపానికి వచ్చిన పెళ్లి కోడుకు బంధువుల్లో 95శాతం మంది తాగే వచ్చారట.. మిగిలిన వాళ్లు మహిళలు, పిల్లలట..! ఇదేదో తాగుబోతు ఫ్యామిలీలా ఉందంటూ సోషల్‌ మీడియాలో యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. పాపం ఆ వధువు ఎన్నో ఆశలతో పెళ్లికి రెడీ అయి ఉంటుంది. ఈ కారణంతో పెళ్లి ఆగిపోవడం ఆమెకు చేదు జ్ఞాపకమే..!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...