ఈ నెల 15న ఏఐసీసీ ఆధ్వర్యంలో చలో రాజభవన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆధాని షేర్ల కుంభకోణం, లక్షల కోట్ల రూపాయల ప్రజల సంపద ఆవిరై తీవ్ర నష్టాల బాటలో ఉన్న విషయాలు, ఎల్ ఐ.సి, ఎస్.బి.ఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలబాట పట్టడం తదితర అంశాలపై 13వ తేదీన చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించింది.
కానీ 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఉన్నందున ఏఐసీసీ సూచన మేరకు 15వ తేదీ బుధవారం నాడు చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంచార్జ్ ఆర్గనైజర్ మహేష్ కుమార్ గౌడ్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విషయాలను గమనించి పెద్ద ఎత్తున చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేశారు.