త‌ల్లి ప్రేమ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలిచిన సింహం..

-

సోష‌ల్ మీడియా అంటేనే వింత వీడియోల‌కు వేదిక‌గా మారిపోయింది ప్ర‌స్తుత కాలంలో. ఇక మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే జంతువుల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతుంటాయి. అడ‌వి జంతువుల‌కు సంబంధించిన వీడియోల‌కు ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇక ఇప్పుడు కూడా ఇలంటి వీడియో గురించే మ‌నం మాట్లాడుకోబోయేది.

ఇక త‌ల్లి ప్రేమ అంటే కేవ‌లం మ‌నుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా స్ప‌స్టంగా కనిపిస్తూ ఉంటుంది. ప్ర‌తి జీవి కూడా త‌ల్లి ఒడిలోనే సేద‌దీరాల‌ని అనుకోవ‌డం సృష్టి ధ‌ర్మం. ప్ర‌తి జీవిలోని త‌ల్లులు కూడా పిల్లలు ఎలా ఉన్నా త‌మ‌కు మాత్రం ఎంతో అందంగానే కనిపిస్తుంటాయి. ఇక ఇప్పుడు అడ‌వికి రాజుగా ఉండే సింహం త‌న పిల్ల‌ను ఎలా ముద్దు చేస్తుందో చూద్దాం.

ఈ వీడియోలో త‌ల్లి సివంగి అయిన ఆడ సింహం త‌న బుజ్జి సింహాన్ని త‌న ప‌క్క‌నే ఉంచుకుంటుంది. కానీ ఆ బుడ్డోడు మాత్రం ప‌క్క‌కు వెళ్లి ఆడుకుంటూ ఉంటాడు. ఇక త‌ల్లి ఏ మాత్ర ఆల‌స్యం చేయ‌కుండా ఇసుక‌లో ఆడుకుంటున్న బుడ్డోడిని ముద్దాడుతూ ఎంతో ఆప్యాయంగా దాన్ని ద‌గ్గ‌ర‌కు తీసుకుంటుంది. ఇక త‌ల్లి, బుడ్డోడు క‌లిసి ఆడుకుంటున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట దుమ్ము లేపుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news