ఆగస్టు 15వ తేదీ 75వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం మొత్తం సిద్ధం అవుతుంది. స్వాంతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను అంబరాన్నంటేలా చేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల భద్రతా విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నాఅరు. ఉగ్రమూకలు అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నందున అనుమానం ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తాజాగా ఢిల్లీలో ఉగ్రమూకలు కుట్రను పోలీసులు భగ్నం చేసారు.
వారి దగ్గర నుండి 15పిస్టోళ్ళు, 50తూటాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేసారు. ప్రస్తుతం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట వద్ద 5వేల మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసారు. ఆగస్టు 15వ తేదీన డ్రోన్లు, బెలూన్లు వంటి వాటిని ఎగరవేయడంపై నిషేధం విధించింది. ఈ మేరకు యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించింది.