మీ కష్టానికి ఫలితం లేదా..? అయితే ఈ అలవాట్లని మానుకుంటే మంచిది…!

చాలా మంది ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయితే ఎంత కష్టపడినా కూడా ఒక్కోక్కసారి ఫలితం ఉండదు. అయితే ఫలితం ఉండకపోవడానికి కారణం మనకి ఉండే చెడు అలవాట్లు. నిజానికి ఈ మూడు దరిద్రపు అలవాట్లు చాలు మన కష్టాన్ని మొత్తం వృధా చేయించడానికి. ఈ అలవాటు కనుక ఉంటే అసలు డబ్బు నిలవదు అని పండితులు అంటున్నారు. అయితే మరి ఆ అలవాట్ల గురించి ఒక లుక్ వేసేద్దాం.

చాలా మంది దేవాలయాలకి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ పూజ చేసే సమయంలో కొబ్బరికాయకి కుంకుమ పెట్టి తర్వాత కొబ్బరికాయ కొడతారు. నిజానికి కొబ్బరికాయకి కుంకుమ బొట్టు పెట్టడం వల్ల ఏ దరిద్రం అయితే తొలగిపోవాలని అనుకుంటామో అది పది వంతులు వచ్చి మనల్ని చుట్టుకుంటుంది. కాబట్టి ఆ అలవాటు మానుకోవాలి.

అలానే చాలా మంది కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళని నిదానంగా ఉంచకుండా ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. ఈ అలవాటు ఉన్న వాళ్ళు మానుకోవాలి లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాళ్ళు రెండూ కుర్చీలో ఉన్నపుడు భూమిని తాకాలి.

అప్పుడే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అలాగే చాలా మంది పెద్దవాళ్ళు ఆచరించిన ఆచార వ్యవహారాలను తప్పు పడతారు. కానీ అటువంటి ఆచారాలను బ్రేక్ చేయకూడదు. అలా చేసారంటే కూడా దరిద్రం పడుతుంది. కనుక ఎప్పుడు కూడా ఈ తప్పులు చేయొద్దు.